Happy Astrology
ఈ నెల 16 నుంచి 18 తేదీ వరకు మూడు రోజుల పాటు రవి, శుక్రులు కన్యా రాశిలో కలిసి ఉండడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలకు ఈ రాశి మిత్ర రాశే అయినందువల్ల కుటుంబం, వాక్కు, ధనం వంటివి ప్రాధాన్యం సంతరించుకుంటాయి. వృషభం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారు ఈ యుతి కారణంగా అత్యధికంగా లాభపడతాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం, సంతాన యోగానికి సంబంధించి శుభవార్తలు వినడం వంటివి కూడా చోటు చేసు కునే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో రవి కలవడం వల్ల కుటుంబ సమస్యలు చాలా వరకు సర్దుమణుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత, సామరస్యం బాగా వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత ఆదాయంతో పాటు జీవిత భాగస్వామి ఆదాయం కూడా పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. విద్య, ఉద్యోగ విషయాల్లో పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధువులు లబ్ధి పొందుతారు.
- సింహం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి రవితో శుక్రుడి కలయిక వల్ల కుటుంబ ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఆధునిక వసతులు కల్పించుకునే అవకాశం ఉంది. భారీగా ఇంటి మరమ్మ తులు చేపడతారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచ నలు కూడా ఉన్నాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పట్టడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశిలో రవి, శుక్రులు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ముఖ్య మైన కుటుంబ అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో దశమాధిపతి రవి, సప్తమ స్థానాధిపతి శుక్రుడు యుతి చెందినందువల్ల, అనేక విధాలుగా కుటుంబ ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత, సామరస్యం బాగా పెరుగుతాయి. మీ సల హాలు, సూచనల వల్ల బంధుమిత్రులు బాగా లబ్ధి పొందుతారు. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా కలిసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
- ధనుస్సు: ఈ రాశికి దశమస్థానంలో రవి, శుక్రులు కలవడం వల్ల కుటుంబ సమస్యలు పరిష్కారం అవు తాయి. కొన్ని ప్రధానమైన చిక్కులు కూడా తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరు గుతుంది. పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, శుక్రుల యుతి జరిగినందువల్ల ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఒకరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబానికి తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వారసత్వపు ఆస్తి లభించే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామి విషయంలో ఊహించని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.