Shubha Yoga: రవి, శనుల కలయికతో మకరరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఆ రాశుల వారికి శుభయోగాలు..!

| Edited By: Janardhan Veluru

Feb 13, 2024 | 5:57 PM

ఈ నెల 14 నుంచి మార్చి 15 వరకు రవి, శనులు కుంభరాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ నెల 14న రవి కుంభ రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. రవి, శనులు తండ్రీ కొడుకులు. అయితే, ఇద్దరూ బద్ధ శత్రువులు. ఈ రెండు పాప గ్రహాలు కలవడం వల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, మకరం, కుంభ రాశులవారికి యోగదాయకంగా ఉంటుంది కానీ, మిగిలిన రాశులకు మిశ్రమ యోగం కలుగుతుంది.

Shubha Yoga: రవి, శనుల కలయికతో మకరరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఆ రాశుల వారికి శుభయోగాలు..!
Shubha Yoga
Follow us on

ఈ నెల 14 నుంచి మార్చి 15 వరకు రవి, శనులు కుంభరాశిలో కలిసి ఉండబోతున్నాయి. ఈ నెల 14న రవి కుంభ రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. రవి, శనులు తండ్రీ కొడుకులు. అయితే, ఇద్దరూ బద్ధ శత్రువులు. ఈ రెండు పాప గ్రహాలు కలవడం వల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, మకరం, కుంభ రాశులవారికి యోగదాయకంగా ఉంటుంది కానీ, మిగిలిన రాశులకు మిశ్రమ యోగం కలుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక యోగదాయకంగా ఉన్నప్పటికీ కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. సాధారణంగా వృత్తి, ఉద్యోగాలపరంగా కలిసి రావడం, అధికారం దక్కడం, ఊహించని విధంగా ఆదాయం పెరగడం, దూర ప్రాంతాల్లో ఉద్యోగం రావడం వంటివి జరిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి లాభస్థానంలో రవి, శనుల కలయిక జరుగుతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా అనూహ్యమైన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో విపరీతంగా లాభాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని విధాలుగానూ ఆర్థిక లాభం ఉంటుంది. ఆక స్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అంది వస్తాయి. బంధుమిత్రులతో అకారణ విరోధాలు తలెత్తుతాయి.
  2. వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడినందువల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి మంచి ఆఫర్లు అంది వస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు బాగా వెనక్కి తగ్గుతారు. ఆదాయం లేదా జీతభత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. విదేశీ అవకాశాలు అందే అవకాశం కూడా ఉంది. అయితే, తండ్రితో గానీ, పై అధికారులతో గానీ విభేదాలు ఏర్పడవచ్చు.
  3. మిథునం: ఈ రాశివారికి నవమ స్థానంలో, అంటే భాగ్య స్థానంలో రవి, శనులు కలవడం వల్ల విదేశీ యానా నికి మార్గం సుగమం అవుతుంది. విదేశీ ప్రయాణానికి, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో ఒకటి రెండు శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆస్తి కలిసి వస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. అయితే, ఉన్నతాధికారులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఉన్నత విద్యలో ఇబ్బందులుంటాయి.
  4. సింహం: ఈ రాశ్యధిపతి అయిన రవి తన బద్ధ శత్రువైన శనీశ్వరుడితో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడం జరుగుతుంది. రాజకీయంగా వైభవం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అయితే, ప్రేమ వ్యవహారాల్లోనూ, దాంపత్య జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి.
  5. మకరం: ఈ రాశికి ద్వితీయ (ధనం, కుటుంబం) స్థానంలో రవి, శనులు కలవడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వాదోపవాదాలలో తనదే పైచేయిగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి జీవితం వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు అవ కాశం ఉంది. నిరుద్యోగు లకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. అయితే, ధన నష్టం జరగడానికి, కుటుంబంలో అపార్థాలు తలెత్తడానికి, వ్యక్తిగత రహస్యాలు బట్టబయలు కావడానికి అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశ్యధిపతి శనితో రవి కలవడం వల్ల సామాజికంగా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. ఉన్నత కుటుంబంలోని వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. అయితే, జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తడం లేదా జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది.