Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే..?

Ugadi 2026 Panchangam Makara Rashi Phalalu: తృతీయ శని, ధనస్థాన రాహు, జూన్ నుంచి సప్తమంలో ఉచ్ఛ గురు ప్రభావంతో మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రారంభంలో కొంత ఒత్తిడి, ఆటంకాలు ఉన్నప్పటికీ, గురు సంచారం తర్వాత సమస్యలను అధిగమించి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా ఆకస్మిక లాభాలు, అదనపు ఆదాయం అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి, పెట్టుబడులు లాభిస్తాయి.

Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మకర రాశి వారికి ఎలా ఉందంటే..?
Ugadi 2026 Panchangam Makara Rashi Phalalu

Edited By:

Updated on: Mar 18, 2026 | 6:47 PM

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు..

ఆదాయం-2, వ్యయం-8 | రాజపూజ్యం-1, అవమానం-2

సంవత్సరమంతా తృతీయంలో రాశ్యధిపతి శనీశ్వరుడు, ధన స్థానంలో రాహువు, జూన్ నుంచి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛస్థితి వల్ల చాలావరకు ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ప్రస్తుతం షష్ట గురువు కారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం, స్వల్ప అనారోగ్య బాధలు ఉంటూ ఉంటాయి. అయితే, సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల అనేక సమస్యలను అధిగమించడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.

ఆర్థిక వ్యవహారాలుః ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అదనపు ఆదాయం కోసం అవిశ్రాంతంగా పని చేయడం జరుగుతుంది. ఆదాయం పెరిగి ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది.

వృత్తి, ఉద్యోగాలుః ఉద్యో గంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యో గులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

కుటుంబ వ్యవహారాలుః కుటుంబ సమస్యలు ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతంగా సాగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది.

Follow Us