ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం మరికొద్ది రోజుల్లో ఏర్పడనుంది. శ్రీ రామ నవమి నవరాత్రులకు ముందు ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది. మతపరంగా, జ్యోతిషశాస్త్రపరంగా గ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అయితే గ్రహణం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది.. ఎక్కడ కనిపిస్తుంది.. తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం..
సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 తేదీ, 9 తేదీ మధ్య రాత్రి ఏర్పడబోతోంది. ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2:22 గంటల వరకు ఉంటుంది. గ్రహణానికి 12 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది. అయితే చంద్రగ్రహణం వలె, ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా భారతదేశంలో గ్రహణ నియమాలు ఏవీ వర్తించవు.
కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కొలంబియా, కోస్టారికా, అరుబా, బెర్ముడా, కరేబియన్ నెదర్లాండ్స్, క్యూబా, డొమినికా, రష్యా, ప్యూర్టో రికో, గ్రీన్‌లాండ్, ఐర్లాండ్, ఐస్‌లాండ్, 2024లో మొదటి సూర్యగ్రహణం కనిపించనుంది. అంతేకాదు జమైకా, నార్వే, పనామా, నికరాగ్వా, సెయింట్ మార్టిన్ స్పెయిన్‌తో సహా ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో కనిపించనుంది.
హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి మరుసటి రోజు చైత్ర అమావాస్య వస్తుంది. ఈ ఏడాది చైత్ర అమావాస్య ఏప్రిల్ 8న, చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అంతేకాదు సూత కాలంలో కూడా ప్రతి శుభ కార్యం నిషేధించబడింది. గ్రహణం సమయంలో రాహు-కేతువుల ప్రభావం పెరుగుతుందని నమ్మకం. కనుక గ్రహణ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు, పూజలు చేయరు.
సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. వృషభ, మిథున, సింహ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతున్నప్పటికీ, మేష, తుల, కుంభ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
ప్ర. 1 ఏప్రిల్ 8 నాటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?
ఏప్రిల్ 8వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది మెక్సికో మీదుగా అమెరికా , కెనడాలో కనిపిస్తుంది.
Q.2 భారత కాలమానం ప్రకారం 2024 సూర్యగ్రహణం
ఏప్రిల్ 8, 2024న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఇది మధ్యాహ్నం 2:12 గంటలకు ప్రారంభమై 2:22 గంటలకు ముగుస్తుంది.
ప్ర. 3 సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు?
జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం సూర్యగ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని, సూతకాల సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని, గ్రహణ సమయంలో నిద్రపోవాలని, అలాగే సూతకాల కాలంలో భగవంతుడిని స్మరించాలని కూడా అంటారు.
Q.4 సూర్యగ్రహణం సమయంలో ఏమి తినాలి?
స్కందపురాణం ప్రకారం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయంలో ఆహారం తినకూడదు. గ్రహణం ఏర్పడే సమయంలో ఇంటిపై, ఆహార వస్తువులపై దర్భలను లేదా తులసి ని జోడించాలి. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత బయటకు తీసి విసిరేయండి.
ప్ర. 5 సూర్యగ్రహణం సమయంలో బయట ఉండటం సరైందేనా?
సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడం మంచిది. అంతేకాదు సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు