Money Horoscope: లక్ష్మీదేవి అవతారంగా శుక్రుడు.. ఆ రాశుల వారికి ధన యోగాలు పక్కా.. !

| Edited By: Janardhan Veluru

Apr 29, 2024 | 5:36 PM

ఏప్రిల్ 25న మేష రాశిలో ప్రవేశించిన శుక్ర గ్రహం మే 19 వరకూ అదే రాశిలో కొనసాగుతాడు. సాధారణంగా శుక్రుడు ఏ రాశిలో ఉన్నప్పటికీ, చివరికి తన నీచ స్థానమైన కన్యారాశిలో ఉన్నప్పటికీ, తన మిత్ర క్షేత్రాలకు మాత్రం తప్పకుండా ధన యోగం కలిగిస్తాడు. పురోగతికి, అభివృద్ధికి సంబంధించి అనేక అవకాశాలు కల్పిస్తాడు. శుక్రుడిని లక్ష్మీదేవి అవతారంగా పరిగణిస్తారు.

Money Horoscope: లక్ష్మీదేవి అవతారంగా శుక్రుడు.. ఆ రాశుల వారికి ధన యోగాలు పక్కా.. !
Dhana Yoga
Follow us on

ఏప్రిల్ 25న మేష రాశిలో ప్రవేశించిన శుక్ర గ్రహం మే 19 వరకూ అదే రాశిలో కొనసాగుతాడు. సాధారణంగా శుక్రుడు ఏ రాశిలో ఉన్నప్పటికీ, చివరికి తన నీచ స్థానమైన కన్యారాశిలో ఉన్నప్పటికీ, తన మిత్ర క్షేత్రాలకు మాత్రం తప్పకుండా ధన యోగం కలిగిస్తాడు. పురోగతికి, అభివృద్ధికి సంబంధించి అనేక అవకాశాలు కల్పిస్తాడు. శుక్రుడిని లక్ష్మీదేవి అవతారంగా పరిగణిస్తారు. శుక్రుడికి డబ్బు, సుఖ సంతోషాలు మాత్రమే ప్రధానం. తనకు ఇష్టమైన రాశులకు ఏదో విధంగా వాటిని సమకూరుస్తాడు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న శుక్రుడు వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు ధన యోగాలు పట్టిస్తాడు.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ, విపరీత రాజయోగం కలిగిస్తాడు. అత్యధికంగా సంపాదించడానికి మార్గాలు సూచిస్తాడు. విలాస జీవితం అలవాటవుతుంది. స్త్రీలను బాగా ఆకట్టుకుంటారు. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్య లున్నా తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. ప్రయాణాలు, పర్యట నలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది.
  2. మిథునం: ఈ రాశి నాధుడు బుధుడికి మిత్రుడైన శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. తప్పకుండా ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా సన్నిహితుడవుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి, రాబడి వృద్ధి చెందు తుంది.
  3. కన్య: ఈ రాశినాథుడైన బుధుడికి శుక్రుడు మిత్రుడు కావడం, పైగా భాగ్య స్థానంలో సంచారం చేస్తు న్నందు వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక మార్గాల్లో అదృష్టం పండుతుంది. సంతానయోగానికి అవకాశం ఉంటుంది. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది.
  4. తుల: ఈ రాశికి అధిపతి అయినందువల్ల శుక్రుడు ఏ రాశిలో సంచారం చేస్తున్నా ఈ రాశివారికి ఎక్కువగా శుభ యోగాలే ఇస్తాడు. ప్రస్తుతం సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అంచనాలకు మించిన పురోగతిని ఇస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి, జీతభత్యాలు వృద్ధి చెందడానికి అవకాశముంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, పెట్టుబడికి తగ్గ లాభాలను ఆర్జించడం జరుగుతుంది. విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంది.
  5. మకరం: రాశ్యధిపతి శనీశ్వరుడు శుక్రుడికి మిత్రుడైన శుక్రుడు ప్రస్తుతం నాలుగవ స్థానంలో దిగ్బలంతో ఉన్నందువల్ల అనేక విధాలుగా సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అనేక దిశల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా సామాజికంగా కూడా హోదాను పెంచే అవకాశముంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మనశ్శాంతినిస్తాయి. వ్యాపా రాల్లో లాభాల పరంగా దూసుకుపోవడం జరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
  6. కుంభం: ఈ రాశికి నాథుడైన శనీశ్వరుడు ఈ శుక్రుడికి ప్రాణ స్నేహితుడైనందువల్ల శుక్రుడు ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాడు. అనేక మార్గాల్లో తప్పకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.