AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar 2024: మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు, ధన లాభాలు..!

మార్చి 30 నుంచి ఏప్రిల్ 23 వరకు తన ఉచ్ఛ స్థానమైన మీన రాశిలో శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. సాధారణంగా శుక్రుడు తన స్వస్థానాల్లో గానీ, ఉచ్ఛ స్థానంలో గానీ సంచారం చేస్తున్నప్పుడు ఏ రాశికైనా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తాడు. దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా తప్పకుండా మంచి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది.

Shukra Gochar 2024: మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు, ధన లాభాలు..!
Shukra Gochar 2024
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 29, 2024 | 7:19 PM

Share

మార్చి 30 నుంచి ఏప్రిల్ 23 వరకు తన ఉచ్ఛ స్థానమైన మీన రాశిలో శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. సాధారణంగా శుక్రుడు తన స్వస్థానాల్లో గానీ, ఉచ్ఛ స్థానంలో గానీ సంచారం చేస్తున్నప్పుడు ఏ రాశికైనా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తాడు. దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా తప్పకుండా మంచి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడు మీన రాశిలోకి వచ్చీ రాగానే మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర, కుంభ రాశులకు కూడా వీలైనంతగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపడుతుండడం వల్ల విలాసాల మీదా, సుఖాల మీదా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందు తాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలున్న పక్షంలో అవి కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. విడాకుల కేసులు ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వైద్య ఖర్చులు చాలావరకు తగ్గిపోతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల విదేశీ యానానికి ఎటువంటి ఇబ్బం దులున్నా తొలగిపోతాయి. విదేశీ సొమ్ము తినే యోగం పడుతుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. తండ్రితో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్ర లకు వెళ్లడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.
  3. సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముం టుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. వారసత్వ సంపద కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని విధంగా జీత భత్యాలు పెరగడం జరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయానికి లోటుండదు.
  4. వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడికి ఉచ్ఛస్థితి కలుగుతున్నందువల్ల సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా, సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి, దాని వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  5. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపడుతుండడం వల్ల ఈ రాశివారి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ముఖ్యంగా విశేషమైన ఆర్థిక పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో మంచి జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి.
  6. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛస్థితికి వస్తున్నందువల్ల తప్పకుండా అనేక విధాలుగా ధన లాభం కలుగుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. జీవనశైలి బాగా మెరుగు పడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!