
మార్చి 29, శనివారం అమావాస్య యుక్త షష్ట గ్రహ కూటమి ఏర్పడుతోంది. దీంతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఆరు గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం, 12 రాశుల వారిపై మే 31వ తేదీ వరకు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గతంలో 2019 డిసెంబర్ 25వ తేదీన షష్ట గ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయ తాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ శనివారం షష్ట గ్రహ కూటమి ఏర్పడుతోంది.
శనివారం… శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనికితోడు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. దీనివల్ల భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పశ్చిమ దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అంటున్నారు జ్యోతిష్య పండితుడు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మే 18 వరకు, సుమారు 3 నెలల పాటు విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. యూరప్‌లో యుద్ధ భయాలు అలుముకుంటాయన్నారు. షష్ట గ్రహ కూటమి ప్రభావం, కుంభం, మీనం, మేషం, సింహం, వృశ్చికం, ధనస్సు రాశులపై ఉంటుందని, వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితుడు చిలకమర్తి. వీరు ఉద్యోగ పరంగా, వ్యాపర పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే..