హిందూ మతంలో నవ గ్రహాల్లో శనీశ్వరుడు చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నాడు. శనీశ్వరుడిని కర్మఫల దాత అని కూడా అంటారు. ఇతర గ్రహాల మాదిరిగానే శనీశ్వరుడి కదలికలో కూడా మార్పులు వస్తాయి. ఒక సారి సరళమైన మార్గంలో కదులుతాడు.. మరికొన్ని సార్లు తిరోగమిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉంటూ జూన్ 29న శనిదేవుడు తిరోగమనంలోకి వెళ్లబోతున్నాడు. కుంభరాశిలో ఉన్న శనిదేవుడు దాదాపు నాలుగైదు నెలల పాటు అంటే నవంబర్ 15వ తేదీ వరకు తిరోగమన దిశలో కదలనున్నాడు.
వాస్తవానికి శనీశ్వరుడు తిరోగమన కదలిక మంచిగా పరిగణించబడదు. శని తిరోగమన ప్రభావం వల్ల మనిషి ఆర్థిక సమస్యలు, అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే శనీశ్వరుడి తిరోగమనం ప్రభావం కూడా కొంతమందికి అనుకూల ఫలితాలను తెస్తుంది. శనీశ్వరుడు ఈ రివర్స్ కదలిక కొంతమందిని అప్రమత్తం చేస్తుంది. మరి కొందరికి అదృష్టాన్ని తెచ్చి.. జీవితాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. శనీశ్వరుడి తిరోగమనం వల్ల ఈ రోజు ఏ రాశులకు చెందిన వ్యక్తులు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం..
కన్యా రాశి: శనిదేవుడు కుంభరాశిలో ఉన్నా.. కన్యారాశి వారికి కొన్ని శుభవార్తలను అందజేస్తాడు. ప్రస్తుతం చదువుతున్న వారికి అంటే విద్యార్థులకు శని తిరోగమనం శుభప్రదం కానుంది. ఈ నాలుగైదు నెలల్లో ప్రతికూల గ్రహాలు బలహీనపడటం వల్ల జీవితంలో సానుకూలత ఉంటుంది. కన్యా రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే పెద్ద సమస్యలు మాత్రం ఎదురుకావు. కన్య రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. తమ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు.
తుల రాశి: శనీశ్వరుడు తిరోగమన కదలిక తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉండి కొన్ని కారణాల వల్ల పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తి కానున్నాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోవాల్సి రావచ్చు. కన్యా రాశి వారు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టబోయేవారు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే కొనడం, అమ్మడం చేయాలి. పెట్టుబడికి శుభతరుణం. కొత్త అవకాశాలు లాభిస్తాయి.
వృశ్చిక రాశి: శనీశ్వరుడు తిరోగమనం జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. దీని కారణంగా వీరి ఆదాయం కూడా పెరుగుతుంది. డబ్బు సమస్యలన్నీ తీరుతాయి. వ్యాపారం చేయాలనుకునే వారు పెట్టుబడి పెట్టడానికి భాగస్వాములను కనుగొనవచ్చు. కెరీర్ పరంగా విజయానికి సహాయపడే కొత్త ప్రాజెక్ట్‌లను పొందవచ్చు. ప్రేమ సంబంధాలలో కొంత మనస్తాపం ఉండవచ్చు.. అయితే తెలివిగా మాట్లాడటం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు