Lord Shani Dev: కుంభ రాశిలో శని, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!

Mahabhagya Yoga: ఈ నెల 8 నుంచి కుంభరాశిలో శని, శుక్రులు కలవడం జరుగుతోంది. కుంభ రాశి శనీశ్వరుడికి స్వక్షేత్రం కాగా, శుక్రుడికి మిత్ర క్షేత్రం. శుక్రుడికి కుంభ రాశిలో దాదాపు ఉచ్ఛ బలం పడుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాల యుతి వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వారికి మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.

Lord Shani Dev: కుంభ రాశిలో శని, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
Lord Shani Dev

Edited By: Janardhan Veluru

Updated on: Mar 07, 2024 | 7:49 PM

ఈ నెల 8 నుంచి కుంభరాశిలో శని, శుక్రులు కలవడం జరుగుతోంది. కుంభ రాశి శనీశ్వరుడికి స్వక్షేత్రం కాగా, శుక్రుడికి మిత్ర క్షేత్రం. శుక్రుడికి కుంభ రాశిలో దాదాపు ఉచ్ఛ బలం పడుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాల యుతి వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వారికి మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకృతమవు తుంది. తమకు రావలసిన ప్రతి రూపాయిని రాబట్టుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభం, ఆస్తి కలిసి రావడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. ఏప్రిల్ 1 వ తేదీ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశికి లాభస్థానంలో శుక్ర, శనులు కలవడం వల్ల తనకు అంది వచ్చిన ప్రతి ఆర్థిక అవకా శాన్నీ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమూ సఫలం అవు తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై, ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ బాగా పెరు గుతుంది. ఇంట్లో సకల సౌకర్యాలను అమర్చుకుంటారు. భోగభాగ్యాలతో తులతూగే అవకాశం ఉంది. ముఖ్యంగా లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా అదృష్టవంతులవుతారు.
  2. వృషభం: ఈ రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశికి యోగకారకుడైన శనీశ్వరుడిని దశమ స్థానంలో కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా మహా భాగ్య యోగాన్ని అనుభవించడం జరుగుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు అదృష్టాన్ని పండిస్తాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగులకే మకాకుండా, ఉద్యోగులకు సైతం విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  3. మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ఈ రాశ్యధిపతి బుధుడికి ప్రాణ స్నేహితుడైన శనీశ్వరుడిని కలవడం వల్ల ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. తండ్రి వైపు నుంచి తప్పకుండా ఆస్తి గానీ, సంపద గానీ సంక్రమిస్తుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా పడుతుంది. ప్రభుత్వపరంగా కొన్ని లాభాలు, ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
  4. తుల: ఈ రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశికి అత్యంత యోగకారకుడైన శనీశ్వరుడిని పంచమ స్థానంలో కలవడం అన్నది అనేక విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యు లేషన్, వడ్డీ వ్యాపారాలు, లాటరీలు వంటివి ఇబ్బడిముబ్బడిగా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆర్థికపరంగా తప్పకుండా ఒకటి రెండు శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి, ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి.
  5. మకరం: ఈ రాశివారికి రాశ్యధిపతి శనీశ్వరుడితో ఈ రాశికి యోగకారక గ్రహమైన శుక్రుడు ధన స్థానంలో కలవడం అన్నది ధన ధాన్య సంపత్తులను బాగా వృద్ధి చేస్తుంది. రావలసిన డబ్బు ఏక మొత్తంగా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు అప్రయత్నంగా చేతికి అందుతాయి. స్త్రీ మూలక ధన లాభానికి, ప్రభుత్వ మూలక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి.
  6. కుంభం: ఈ రాశిలో రాశినాథుడు శనీశ్వరుడితో యోగ కారకుడైన శుక్రుడు యుతి చెందడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరగడంతో పాటు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగు తాయి. ఆస్తి కలిసి రావడం గానీ, ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కావడం గానీ జరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో దాదాపు కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ఈ నెలాఖరు వరకు ఆర్థికంగా మంచి యోగం పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.