Job Astrology: కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా..!

| Edited By: Janardhan Veluru

Apr 18, 2024 | 7:06 PM

శని, కుజులు కలిసినా, పరస్పరం చూసుకున్నా కొన్ని రాశుల వారి సత్తాను, ప్రావీణ్యాన్ని, నైపుణ్యాలను విపరీతంగా పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు కుంభ రాశిలో కలిసి ఉన్నందువల్ల కొన్ని రాశుల వారు వృత్తి, ఉద్యోగాల్లో తమ సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగుల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వచ్చి, కొత్త గుర్తింపు లభిస్తుంది.

Job Astrology: కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా..!
Job Astrology
Follow us on

శని, కుజులు కలిసినా, పరస్పరం చూసుకున్నా కొన్ని రాశుల వారి సత్తాను, ప్రావీణ్యాన్ని, నైపుణ్యాలను విపరీతంగా పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు కుంభ రాశిలో కలిసి ఉన్నందువల్ల కొన్ని రాశుల వారు వృత్తి, ఉద్యోగాల్లో తమ సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగుల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వచ్చి, కొత్త గుర్తింపు లభిస్తుంది. శని, కుజుల కలయిక వల్ల ప్రస్తుతం అధిక లాభాలు పొందబోయే రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశులు. కుజుడు ఈ రాశిలో శనితో కలిసి ఉండడమనేది ఈ నెల 23 వరకూ జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో శని, కుజుల కలయిక వల్ల ఈ రాశివారి ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరికి డిమాండు బాగా పెరుగుతుంది. ఎంతటి శ్రమకైనా, చాకిరీకైనా వెనుకాడని ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల తగిన గుర్తింపుతో పాటు ధనాదాయం కూడా పెరిగే అవకాశముంది. ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన నైపుణ్యాలను బాగా పెంచుకుని సంస్థలకు ఉపయోగపడే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశివారికి ఉద్యోగ స్థానంలోనే ఈ రెండు గ్రహాల కలయిక చోటు చేసుకున్నందువల్ల, వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరిగి, బరువు బాధ్యతలను, ప్రత్యేక బాధ్యతలను పెంచడం జరుగుతుంది. అధికారాలను పంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగులకు, నిరు ద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎంతటి పని భారాన్నయినా తట్టుకునే శక్తి ఈ రాశి వారికి ఉండడం, పైగా శని, కుజులు కలవడం వల్ల వీరు తమ పనితీరుతో అధికారులకు దగ్గరవుతారు.
  3. సింహం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ, శనులు కలిసి ఉండడం వల్ల ఈ రాశివారి నాయకత్వ లక్షణాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఎంతటి బరువు బాధ్యతలనైనా భరించడానికి సిద్ధపడే ఈ రాశివారికి అధికార పరంగానే కాక, ఆదాయపరంగా కూడా కాలం కలిసి వస్తుంది. వీరిలోని ప్రతిభకు, శ్రమపడే తత్వానికి ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి జీవితంలో వీరి నైపుణ్యాలు, ప్రావీణ్యాలు బాగా రాణిస్తాయి. వీరి వల్ల సంస్థలు అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి.
  4. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కుజ, శనులు కలుసుకోవడం వల్ల అధికారులకు వీరు నమ్మకస్తు లనే, ఆధారపడదగినవారనే అభిప్రాయం దృఢపడుతుంది. ఎటువంటి బాధ్యతనైనా మోయగలిగిన వీరి తత్వం వల్ల సంస్థకు ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా ఒక ప్రణాళికాబద్దంగా వ్యవహ రించే వీరి తత్వం, ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకునే తీరు వల్ల వీరు అధికారులకు దగ్గరవుతారు. ఆదాయపరంగా ఇతరుల కంటే వేగంగా వీరు అభివృద్ధి చెందుతారు.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ, శనుల సంచారం వల్ల ఈ రాశివారి చొరవ, దూకుడు తత్త్వం, ప్రయత్నాలు, ధైర్య సాహసాలకు ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అతి త్వరగా అధికార యోగం పట్టే అవకాశం ఉంటుంది. ఈ రాశివారిలోని క్రమశిక్షణ, నిజాయతీ, నైపుణ్యాలు సంస్థకు, అధికారులకు బాగా ఉపయోగపడతాయి. ఫలితంగా పదోన్నతులకు, ఊహించని ఆదాయ వృద్ధికి అవకాశముంటుంది. వీరు క్రమంగా తమ సంస్థలకు ఆస్తులుగా మారే అవకాశం కూడా ఉంటుంది.
  6. కుంభం: ఈ రాశిలో రాశ్యధిపతి శనితో కుజుడు కలవడం వల్ల వీరు అనేక విధాలుగా ఉద్యోగంలో తమ సత్తాను నిరూపించుకునే అవకాశముంటుంది. వీరిలోని మొండి పట్టుదల, నిబద్ధత, అంకిత భావం అధికారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీరికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశముంటుంది. అధికారులు ఈ రాశివారి మీద ఎక్కువగా ఆధారపడడం, ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం తప్పకుండా జరుగుతుంది.