Lucky Horoscope
Image Credit source: Getty Images
ఈ నెల 24, 25 తేదీలు కొన్ని రాశుల వారికి చాలా చాలా మంచి రోజులుగా ఉండబోతున్నాయి. ఆ రెండు రోజుల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, అదే రాశిలో గజకేసరి యోగం ఏర్పడడం, బుధుడు కన్యారాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం, అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడడం, శుక్రుడు స్వక్షేత్రమైన తులా రాశిలో సంచరిస్తుండడం, శని స్వక్షేత్రంలో ఉండడం వంటి పరిణామాల వల్ల ఆ రెండు రోజులు అత్యంత శుభప్రదంగా, అత్యంత యోగదాయకంగా మారబోతున్నాయి. ఈ రెండు రోజుల్లో మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి కెరీర్ పరంగా, ఆదాయపరంగా అరుదైన అదృష్టాలు పట్టబోతున్నాయి.
- మేషం: ఈ రాశివారు 24, 25 తేదీలలో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ఊహించని సత్ఫలితాల నిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశివారి జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం ఊహించని విధంగా సానుకూల మలుపులు తిరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరు కుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రెండు రోజుల్లో ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- మిథునం: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు కలుగు తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పిత్రార్జితం ఎట్టకేలకు లభి స్తుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం గానీ, విదేశాల్లో ఉద్యో గం చేయడం కానీ జరుగుతుంది. ఆ రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాలని స్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
- కన్య: ఈ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ధనపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా అత్యధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందు తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబంలో అతి ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృశ్చికం: ఈ రాశివారికి అర్దాష్టమ శని కష్టనష్టాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. జీవితం సుఖ సంతో షాలతో సాగిపోతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. భోగభాగ్యాలు వృద్ధి చెందు తాయి. విలాస జీవితంలో మునిగి తేలుతారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది.
- మకరం: ఈ రాశికి మహా భాగ్య యోగం, అధికార యోగం పడతాయి. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగు పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కా రమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఈ రెండురోజుల్లో తీసుకునే నిర్ణయాలు, ప్రయత్నాలన్నీ తప్పకుండా సఫలం అవుతాయి. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ కార్యాలు జరుగుతాయి. అనేక శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది.