గ్రహణాలకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ గ్రహణాలను హిందూ మతంలో జ్యోతిషశాస్త్రంలో చెడుగా భావిస్తారు. సూర్య, చంద్ర గ్రహణాలు రాహు, కేతు కారణంగా ఏర్పడతాయని విశ్వాసం. గ్రహణాలు ఏర్పడే సమయంలో వాతావరణంలో ప్రతికూలత పెరుగుతుందని.. ఎటువంటి పూజలు, శుభ కార్యాలు చేయకూడదని సనాతన ధర్మంలో విశ్వాసం. ఈ ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు మొత్తం నాలుగు ఏర్పడనున్నాయి. ఇప్పటికే సూర్య, చంద్ర గ్రహణాలు రెండు ఏర్పడ్డాయి. ఏడాదిలో మూడో గ్రహణం.. చివరి సూర్య గ్రహణం అక్టోబర్ నెలలో సంభవించనున్నది.
ఈ సంవత్సరంలో చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14న (శనివారం) ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం కంకణాకార గ్రహణంగా ఏర్పడనుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచడు.. సూర్యుడు అగ్ని వలయంలా దర్శనమిస్తాడు. అయితే ఈ సూర్య గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. కనుక సూతకాలం ఉండదు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఈ గ్రహణం కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపించనుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వ్యక్తులపై కంకణాకర సూర్య గ్రహణం అశుభాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు స్నేహితులు, సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది.
వృషభ రాశి: ఈ రాశివారు రానున్న సూర్యగ్రహణం కారణంగా ఆర్ధిక నష్టాలు కలగవచ్చు. ధన నష్టం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడండి.
కన్య రాశి: ఈ రాశి వారికీ సూర్య గ్రహణం అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. అంతేకాదు కుటుంబ సభ్యులు, స్నేహితులతో విబేధాలు ఏర్పడవచ్చు. ఆర్ధిక కష్టాలు కలిగే అవకాశం ఉంది. మాట్లాడే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల రాశి: ఈ రాశివారిపై కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు మానసికంగా ఇబ్బందులను ఒత్తిడిని ఎదుర్కొంటారు. డబ్బుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).