హమ్మయ్య.. ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్..! శని దోషం నుంచి విముక్తి

శనిశ్వరుడు ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తూ కొన్ని రాశుల వారిని అష్టకష్టాలకు గురిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు శనీశ్వరుడు ఉచ్చస్థితిలోని గురువు అదుపులోకి రావడంతో మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి వచ్చే నాలుగున్నర నెలలు అనుకూల సమయంగా మారనుంది. ఈ కాలంలో శని దోష ప్రభావం తగ్గి యోగదాయక పరిస్థితులు ఏర్పడవచ్చని భావిస్తున్నారు.

హమ్మయ్య.. ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్..! శని దోషం నుంచి విముక్తి
Lord Shani Dev

Edited By:

Updated on: Jun 08, 2026 | 1:16 PM

ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తూ మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులను అష్టకష్టాలు పెడుతున్న శనీశ్వరుడు ఇప్పుడు పూర్తిగా ఉచ్ఛ గురువు అదుపులోకి రావడం జరిగింది. ఈ పరిస్థితి అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ రాశుల వారికి మరో నాలుగున్నర నెలల పాటు శని దోషం నుంచి పూర్తిగా విముక్తి లభించింది. వీరికి యోగదాయకమైన కాలం ప్రారంభమైంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, అనారోగ్యం నుంచివిముక్తి లభించడం, విదేశీ ఉద్యోగాలు లభించడం, పెళ్లి సంబంధాలు కుదరడం, సంతానం కలగడం వంటివి జరుగుతాయి. అయితే, శనికి తరచూ దీపం వెలిగించడాన్ని కొనసాగించడం మంచిది.

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న శనిని చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నగురువు పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి అక్టోబర్ 31 వరకు ఏలిన్నాటి దోషం పూర్తిగా తొలగిపోయింది. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతుంది. అనేకవిధాలాఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  2. సింహం: ఈ రాశిని గత కొద్ది కాలంగా పీడిస్తున్న అష్టమ శని దోషం గురు దృష్టితో చాలావరకు తొలగిపోయింది. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శనిని లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి కొద్ది కాలం పాటు కష్టనష్టాల నుంచి ఉపశమనం లభించింది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అధికార యోగం పడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది.
  4. ధనుస్సు: రాశినాథుడు గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి, చతుర్థంలో ఉన్న శనిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయింది. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కుతారు. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది.ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశివారు గత నాలుగేళ్లుగా అనుభవిస్తున్న కష్టనష్టాల నుంచి నాలుగున్నర నెలల పాటు విముక్తి లభించింది. ఇక నుంచి ఈ రాశివారి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అనారోగ్యాలకు ఏమాత్రం అవకాశం ఉండదు. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి.
  7. మీనం: ఈ రాశిని రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితి నుంచి వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం మటుమాయం అయినట్టేనని భావించాలి. ఈ రాశివారికి అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. నష్టాల కంటే లాభాలే ఎక్కు వగా కలుగుతుంటాయి. ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కూడా బాగా కలిసి వస్తాయి. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది.
Follow Us