Sankranti 2024: సంక్రాంతికి ఏర్పడిన అమృత యోగం.. ఈ 6 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

| Edited By: TV9 Telugu

Jan 16, 2024 | 1:16 PM

ఈరోజు సోమవారం ఉదయం 8:42 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినట్లు జ్యోతిష్యులు చెప్పారు.  ఈ సంవత్సరం మకర సంక్రాంతికి అమృత యోగంతో పాటు రవి యోగం కూడా ఏర్పడనుంది. దీంతో ఈ సంక్రాంతి నుంచి కొన్ని రాశుల వారికీ సానుకూలతను తెస్తుంది. ముఖ్యంగా ఆరు రాశుల వారికీ ధన యోగం ఉంటుంది. ఈ సంక్రాంతి కుంభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Sankranti 2024: సంక్రాంతికి ఏర్పడిన అమృత యోగం.. ఈ 6 రాశులవారు పట్టిందల్లా బంగారమే..
Makara Sankranti 2024
Follow us on

సూర్యుడు రాశులను మారే కాలాన్ని సంక్రాంతి అంటారు. నెలకు ఒక రాశి చొప్పున మొత్తం 12 రాశుల్లోనూ సూర్యుడు సంచరిస్తూ ఉంటారు. ఇలా ఏ సంక్రాంతి సమయంలోనైనా చేసే స్నానానికి, దానానికి, జపం, యాగాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఇలా సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. సూర్యుడు మకర రాశి నుంచి ఉత్తర కర్కాటక రాశి వైపు వెళ్లడాన్ని ఉత్తరాయణం అని, కర్కాటక రాశి నుంచి దక్షిణ మకర రాశి వైపు వెళ్లడాన్ని దక్షిణాయనం అంటారు. ఉత్తరాయణంలో రోజులు ఎక్కువ ఉంటాయి. పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. దక్షిణాయణంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది.

జ్యోతిష్యులు ఈ విషయంపై మాట్లాడుతూ.. ఉత్తరాయణం దేవతలకు పగటి సమయం, దక్షిణాయణం దేవతలకు రాత్రి సమయంగా చెప్పారు. వేద కాలంలో ఉత్తరాయణాన్ని దేవయానమని, దక్షిణాయనాన్ని పిత్రియన్ అని పిలిచేవారు. మకర సంక్రాంతి రోజున యాగంలో నైవేద్యాన్ని స్వీకరించేందుకు దేవతలు భూమికి దిగివస్తారు. ఈ మార్గం ద్వారా పుణ్యాత్ములు తమ శరీరాలను విడిచిపెట్టి స్వర్గలోకానికి చేరుకుంటారని విశ్వాసం. పురాణ గ్రంధాల ప్రకారం సంక్రాంతి రోజున చేసే ధర్మం, దానత్వం, జపం  వంటి  మతపరమైన ఆచారాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా చేసే దానం జన్మ జన్మలకు వందరెట్ల ఫలాన్ని అందిస్తుంది. .

మకర సంక్రాంతి రోజున రాశుల ప్రభావం

ఈరోజు సోమవారం ఉదయం 8:42 గంటలకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినట్లు జ్యోతిష్యులు చెప్పారు.  ఈ సంవత్సరం మకర సంక్రాంతికి అమృత యోగంతో పాటు రవి యోగం కూడా ఏర్పడనుంది. దీంతో ఈ సంక్రాంతి నుంచి కొన్ని రాశుల వారికీ సానుకూలతను తెస్తుంది. ముఖ్యంగా ఆరు రాశుల వారికీ ధన యోగం ఉంటుంది. ఈ సంక్రాంతి కుంభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మకర, కుంభ రాశి వారికి నిలిచిపోయిన పనులు వేగవంతంగా ప్రారంభమవుతాయి.

మేష రాశి, వృశ్చిక రాశులకు చెందిన వారు భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు.

వృషభ, తుల రాశి వారికి వాహన కొనుగోలు, నిర్మాణాలు చేపట్టే అవకాశాలు లభిస్తాయి.

మిథున, కన్యా రాశుల వారికి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది

కర్కాటక రాశి వారికి వ్యాపారంలో లాభాలు పొందుతారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పని పూర్తి చేస్తారు.

సింహ రాశి వారికి వాహనాన్ని ఖరీదు చేసే ప్రయత్నం చేస్తారు. రాజకీయంగా మంచి గుర్తింపు లభించే  అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు, మీనం రాశుల వారికి సామాజికంగా కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు