మనుషుల మధ్య ఎటువంటి బంధాలు, సంబంధాలు నిలబడాలన్నా.. విశ్వాసం నమ్మకం ముఖ్యం. నమ్మకంపైనే ప్రేమ, సామజిక, ఆర్ధిక బంధాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాదు నమ్మకం జీవితానికి దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది. అయితే ఇలాంటి నమ్మకం, విశ్వాసం గల వ్యక్తులు అరుదుగా లభిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు లాయల్టీ చార్ట్‌కి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా కొందరు సంఖ్యాశాస్త్రవేత్తలు ఈ రాశికి చెందిన వ్యక్తుల్లో నమ్మకం, విశ్వాసం నేచర్ తక్కువని.. ఇటువంటివారితో ఏర్పరచుకునే బంధాలను నిలబెట్టుకోరని.. ఈ రాశి వ్యక్తులు సంబంధంలో అనుకున్నంత విశ్వసనీయంగా ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఏ రాశులవారు నమ్మకానికి చాలా దూరం అంటున్నారు అవి ఏమిటంటే..
మేషరాశి వారు కొంచెం ఎక్కువ స్వార్ధపరులు.. నేచర్ కూడా భయంకరంగా ఉంటుంది. ఏదైనా ఈ రాశివారికి నచ్చిందంటే.. దానిని సొంతం చేసుకునే వరకూ నిద్రపోరు.. తమకు నచ్చిన వారిని జయించడమే వారి లక్ష్యం. అయితే ఈ రాశివారు తమ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత.. మళ్ళీ దానిపట్ల ఆసక్తిని చూపించారు.. ఈజీగా విసుగు చెందుతారు. మళ్ళీ కొత్త విషయాలపై దృష్టి పెడతారు. తదుపరి సాహసయాత్రను ఇష్టపడతారు.
మిథున రాశివారు ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి స్వభావం బహిరంగ రహస్యమే. అంతేకాదు చాలా ఈజీగా తప్పుడు వాగ్దానాలు చేస్తారు, చాలా సులభంగా అబద్దాలు చెబుతారు. వీరిలో విశ్వసనీయత ఉండదు. కనుక ఈ రాశి వ్యక్తులు ఏ బంధానికి దీర్ఘకాలంగా కట్టుబడి ఉండలేరు
తులారాశి వ్యక్తులు కూడా చాలా గందరగోళంగా ఉంటారు. వీరు నిర్ణయాలను చాలా సులభంగా తీసుకుంటారు. ఏ నిర్ణయానికి కట్టుబడి ఉండరు. ఈజీగా తమ స్వభావాన్ని మార్చుకుంటారు. అంతేకాదు .. ఈ రాశివారు నిజాన్ని.. నిజమైన ఉద్దేశాలను దాచిపెట్టడంలో మంచి నిపుణులు. ఇంకా చెప్పాలంటే.. ఈ రాశివారు అని రాశివారికంటే నకిలీగా జీవిస్తారు. కనుక వీరిని ఎప్పటికీ విశ్వసించకండి. ఎందుకంటే.. ఈ రాశివారు తమకు కావాల్సింది ఇతరుల నుంచి పొందిన తర్వాత.. వారిని చాలా సులభంగా విడిచి పెడతారు.
ధనుస్సు రాశి వారు ప్రపంచంలోని ఉన్న ప్రేమంతా వీరికి దక్కినా.. ఇంకా ఎదో పొందలేదని భావిస్తారు. నిత్యఅసంతృప్త వాదులు. నిజంగా అర్హులైన ప్రేమను తాము పొందడం లేదని భావిస్తారు. ఈ రాశివారు చాలా మనోహరంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ఇది సహజ లక్షణం. అయినప్పటికీ ఎంత దక్కినా ఇంకా ఎదో తమకు దక్కలేదనే అనుమానంతో జీవితాన్ని గడిపేస్తారు.
కుంభరాశి.. ఈ రాశి వ్యక్తులను.. అన్ని రాశుల వ్యక్తుల కంటే నమ్మకం, విశ్వాసం లేని వ్యక్తులని పేర్కొన్నారు. ఎప్పుడూ తమను ఇతరులు స్వచ్ఛంగా ప్రేమించలేదని అనుమానిస్తూ ఉంటారు. అంతేకాదు వీరి భాగస్వామి ముందు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి కూడా వెనుకాడరు. ఎటువంటి భాగస్వామితో బంధాన్ని అయినా అనుమానంతో విచ్చిన్నం చేసుకుంటారు.
మీన రాశి వారు అన్ని కాలాలలో కలలు కంటూనే ఉంటారు. వీరి కలలు , ఊహలు నిజ జీవితానికి చాలా దూరంగా ఉంటాయి. అయితే ఈ రాశివారు చాలా భావోద్వేగం, సున్నితత్వం కలిగి ఉంటారు. చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితాన్ని కథలకు అనుగుణంగా గడుపుదామని భావిస్తారు. కలల్లో విహరిస్తారు. వాస్తవానికి దూరంగా జీవిస్తారు.
ఈ రాశుల వారు విశ్వాసపాత్రులు: వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం , మకరం వారి భాగస్వామికి కట్టుబడి ఉండే నమ్మకమైన వ్యక్తిత్వం కలవారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)