Parivartan Yoga: ఆ రాశుల వారికి అరుదైన యోగం.. అంచనాలకు మించి ఆదాయం..!

| Edited By: Janardhan Veluru

Jul 24, 2024 | 6:21 PM

ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు చంద్ర, శుక్రుల మధ్య అరుదైన పరివర్తన యోగం చోటు చేసుకుంటోంది. శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశిలో చంద్రుడు, చంద్రుడికి స్వస్థానమైన కర్కాటక రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. ఇందులో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల శుభ ఫలితాలు రెట్టింపు బలంతో పనిచేసే అవకాశం ఉంటుంది.

Parivartan Yoga: ఆ రాశుల వారికి అరుదైన యోగం.. అంచనాలకు మించి ఆదాయం..!
Parivartan Yoga
Follow us on

ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు చంద్ర, శుక్రుల మధ్య అరుదైన పరివర్తన యోగం చోటు చేసుకుంటోంది. శుక్రుడు అధిపతి అయిన వృషభ రాశిలో చంద్రుడు, చంద్రుడికి స్వస్థానమైన కర్కాటక రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. ఇందులో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల శుభ ఫలితాలు రెట్టింపు బలంతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ యోగం వల్ల సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. మొత్తం మీద శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి ద్వితీయ, చతుర్థ స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తుల విలువ పెరగడం, ఆస్తులు కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉన్నతస్థాయి పరిచయాలు ఏర్పడతాయి.
  2. వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడితో ఉచ్ఛ చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ప్రయాణాల వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగుపడు తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బంధుమిత్రుల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు, లాభ స్థానాధిపతి శుక్రుడితో పరివర్తన జరిగినందువల్ల, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదా యం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి అనారోగ్యానికైనా సరైన చికిత్స లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యో గులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  4. కన్య: ఈ రాశికి భాగ్య, లాభ స్థానాల మధ్య పరివర్తన జరిగినందువల్ల మహా భాగ్య యోగం పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి రావడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యో గంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల కలలో కూడా ఊహించని మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశీ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అందే సూచనలున్నాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది. పితృమూలక ధన లాభం ఉంటుంది. లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
  6. మకరం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.