
Raja Yoga
జ్యోతిష శాస్త్రంలో ఉపచయ స్థానాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఉపచయ స్థానాలంటే వృద్ధి స్థానాలు. జాతక చక్రంలో 3,6,10,11 స్థానాలను వృద్ధి స్థానాలంటారు. ఈ రాశుల్లో పాప గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా శుభ ఫలితాలనిస్తాయి. ఏ రంగంలో ఉన్నా పురోభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుదల, పదోన్నతులు, ఆర్థిక పురోగతి, ధన యోగాలు, ప్రయత్నాల్లో విజయాలు వంటివి చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం రవి గ్రహం ఉపచయ స్థానాల్లో సంచారం చేస్తున్న వారికి ఈ రకమైన వృద్ధి యోగాలు కలుగుతాయి. వచ్చే నెల 16 వరకు వృషభం, కర్కాటకం, కన్య, తుల, కుంభ రాశులకు రాజయోగాలు పట్టబోతున్నాయి.
- వృషభం: ఈ రాశికి మూడ స్థానంలో రవి సంచారం వల్ల ఎటువంటి ప్రయత్నాలైనా ఫలించడంతో పాటు, ఎటువంటి సమస్యలైనా చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఆదాయ వృద్ది ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి., వృత్తి, ఉద్యోగాలపరంగా స్థిరత్వం లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- కర్కాటకం: ఈ రాశిలో ధనాధిపతి రవి సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల జాతకపరంగా ఎటువంటి దోషాలున్నా కొట్టుకుపోతాయి. వ్యక్తిగత, ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు, ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద అన్నివిధాలా పైచేయి సాధిస్తారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. కీర్తి ప్రతిష్ఠలు, పలుకుబడి పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు బాగావృద్ధి చెందుతాయి. ఆర్థికంగా ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
- కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో సీనియర్లను కాదని మీకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోతారు. రాజకీయంగా ఊహించని ఎదుగుదల ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక సమస్యలు చాలావరకు సమసిపోతాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాదిస్తారు. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.