పరుగెత్తి వస్తోంది రాహువు..! ఆ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది

మే 18న రాహువు మీన రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభ రాశిలో రాహువు బలంగా ఉంటాడు. కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఈ సంచారం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వంటివి సంభవించవచ్చు. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, వినాయకుని పూజ వంటి పరిహారాల ద్వారా ఈ ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

పరుగెత్తి వస్తోంది రాహువు..! ఆ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
Rahu Transit

Edited By:

Updated on: May 03, 2025 | 6:19 PM

శని, కుజుడి కంటే అత్యంత ప్రమాదకరమైన రాహు గ్రహం ఈ నెల(మే) 18న మీన రాశి నుంచి కుంభ రాశిలోకి మారబోతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు ఒక విష సర్పం. పైగా వక్ర గ్రహం. కుంభ రాశిలో రాహువుకు బలం ఎక్కువ. అందువల్ల రాహువుతో ఈ ఏడాది కొన్ని రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుంభ రాహువు అనుకూలంగా లేనివారు రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద స్తోత్రాన్ని పఠించి తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించడం మంచిది. వీలైనప్పుడల్లా సుబ్రహ్మణ్యస్వామి లేదా వినాయకుడి ఆలయానికి వెళ్లి అర్చన చేయించడం కూడా చాలా మంచిది. కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంది.

  1. కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలోకి రాహువు ప్రవేశిస్తున్నందువల్ల కష్టార్జితంలో సగానికి సగం వృథా కావడం జరుగుతుంది. నమ్మినవారు మోసం చేయడం, బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టాలు కలగడం, ఆస్తి విషయంలో తోబుట్టువులు మోసం చేయడం, ఉద్యోగంలో అధికారులు ఇబ్బంది పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. రోగ నిర్ధారణ చేయలేని అనారోగ్యాలతో బాధపడే అవకాశం కూడా ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి.
  2. సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యాలకు లోనుకావడం జరుగుతుంది. వ్యసనాలు అలవడే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులు దాదాపు వెట్టి చాకిరీ చేయించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు కొన్ని కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సాఫీగా సాగకపోవచ్చు. కుటుంబ జీవితంలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
  3. తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు సంచారం వల్ల రాజపూజ్యాల కంటే అవమానాలు ఎక్కు వగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు చులకనగా చూసే అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రాభవం, ప్రాధాన్యం తగ్గుతాయి. మీ నుంచి గతంలో సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. నమ్మినవాళ్లు మోసం చేస్తారు. పిల్లల నుంచి సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు చదువుల్లో వెనకబడతారు. ప్రయాణాల్లో నష్టపోయే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు ప్రవేశం వల్ల దాదాపు అర్ధాష్టమ శని ఫలితాలు అనుభవా నికి వస్తాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. తల్లి తరచూ అనారోగ్యాల పాలవుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు పెరిగి, టెన్షన్లు కలుగుతాయి. అనారోగ్యాలు బాగా ఇబ్బంది పెడతాయి.
  5. మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులు డబ్బు తీసుకోవడమే కాని ఇవ్వడం ఉండదు. మాట తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో వాగ్వాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. కుటుంబ సభ్యుల పైన ఖర్చులు బాగా పెరుగుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం కుదరదు. ముఖ్యమైన శుభకార్యాలు సైతం వాయిదా పడతాయి.
  6. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవచ్చు. కష్టా ర్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టినా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఇవ్వాల్సిన డబ్బు మీద బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.