Rahu Ketu Gochar: ఈ నెల 16న రాహు, కేతు నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి అన్నీ నష్టాలే.. జాగ్రత్త సుమా..

జ్యోతిషశాస్త్రంలో మానవ జీవితంలో మంచి చెడులకు గ్రహాలు, రాశుల కదలిక మీద ఆధారపడి ఉంటుందని పేర్కొంది. నవ గ్రహాల్లో రాహు-కేతువులను నీడ గ్రహాలుగా పరిగనిస్తారు. ఈ గ్రహాలు అశుభ ఫలితాలను ఇచ్చే ఛాయా గ్రహాలు. హోలీ తర్వాత ఈ రెండు రాశులు తమ రాశిని మార్చుకోనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారు భారీ నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Rahu Ketu Gochar: ఈ నెల 16న రాహు, కేతు నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి అన్నీ నష్టాలే.. జాగ్రత్త సుమా..
Rahu Ketu Gochar

Updated on: Mar 04, 2025 | 10:18 AM

జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశులను, నక్షత్రాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల మార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి ఈ మార్పులు శుభ ఫలితాలను కలుగజేస్తే.. అదే సమయంలో కొన్ని రాశుల వారికి చాలా సమస్యలను కలిగిస్తాయి. హోలీ తర్వాత పాప గ్రహాలుగా పిలువబడే రాహు, కేతు గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

రాహువు, కేతువులు ఎప్పుడు రాశిని మార్చుకుంటారంటే..

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మార్చి 14న హోలీ పండుగ జరుపుకోనున్నారు. హోలీ పండగ జరుపుకున్న రెండు రోజుల తర్వాత అంటే మార్చి 16వ తేదీ గురువారం రాహువు, కేతువు నక్షత్రాలను మారతాయి.

ఏ రాశులకు కష్టాలు పెరుగుతాయంటే

మేష రాశి: రాహు, కేతు నక్షత్రాల మార్పు కారణంగా మేష రాశి వారు భారీ నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి, వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబం, వైవాహిక జీవితంలో ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. వీరు తమ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. కొత్త పపనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకోండి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో పాత వ్యాధులు ఏవైనా బయటపడవచ్చు. దీనివల్ల వీరు శారీరక నొప్పిని అనుభవించాల్సి రావచ్చు.

ఇవి కూడా చదవండి

కన్య రాశి: ఈ రాశి వారికి రాహు, కేతు నక్షత్రాలను మార్చుకోవడం వలన అనేక కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కన్య రాశి వ్యక్తులు పనిలో లేదా ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులు తమకు ఇష్టం లేని ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదుప్రమోషన్స్, ఇంక్రిమెంట్‌లో అడ్డంకులు ఉండవచ్చు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. అదే సమయంలో మానసికంగా అశాంతికి గురయ్యే అవకాశం ఉంది.

మీన రాశి: రాహువు, కేతువులు మీన రాశి వారి జీవితాల్లో సమస్యలను సృష్టించగలరు. ఈ సమయంలో వీరు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో లాభాలు నెమ్మదిస్తాయి. మీ ఆఫీసులో ఎవరితోనైనా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణించేటప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు