Solo Rahu Effects
మీన రాశి నుంచి జూన్ 1న కుజుడు నిష్క్రమిస్తుండడంతో అదే రాశిలో ఉన్న రాహువు ఒంటరిగా మిగిలిపోవడం జరుగుతుంది. రాహువు మరో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఒక విధంగా, ఒంటరిగా ఉన్నప్పుడు మరో రకంగా ఫలితాలనిస్తాడు. ఇప్పట్లో రాహువుతో మరో గ్రహం కలిసే అవకాశం లేనందువల్ల, ఈ ఏడాది చివరి వరకూ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇష్టానుసారం ఇవ్వడం జరుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశులకు ఈ మీన రాశి రాహువు వల్ల అపార ధన లాభంతో పాటు ఊహించని అధికార యోగం పట్టే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి 11వ స్థానంలో రాహువు సంచారం వల్ల ఏ ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా అంచనాలకు మించిన లాభం ఉండే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో తప్పకుండా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన లాభం వంటివి అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కలలో కూడా ఊహించని విధంగా రాజయోగం పడుతుంది. సమాజంలో డాబూ, దర్పాలతో జీవిం చడం జరుగుతుంది. ఉద్యోగపరంగా అనేక శుభ వార్తలు వింటారు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఆఫర్లు అంది వస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవ కాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల విదేశాలకు వెళ్లే అవకాశాలు మెరు గుపడతాయి. ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. గంగా స్నాన యోగం అంటే తీర్థయాత్రలు చేసే యోగం పడు తుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఉన్నత స్థాయి స్నేహాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతాయి.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు సంచరించడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. శత్రు వులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో రాజ యోగం అనుభవిస్తారు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి మూడవ స్థానంలో రాహువు సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు పొందుతారు. ప్రయాణాల వల్ల బాగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. అనేక విధాలుగా ఆదాయం గడించే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలను సాధించడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో ఆశించిన పురోగతి సాధిస్తారు.