Bhadra Raj Yoga 2023: కొత్త ఏడాదిలో అరుదైన భద్ర రాజయోగం.. ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. పెళ్లికానివారికి వివాహ యోగం..

|

Dec 31, 2022 | 4:42 PM

డిసెంబర్ 31, 2022న, బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు బృహస్పతి అధిపతి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జనవరి 18, 2023న బుధుడు ప్రత్యక్ష మార్గంలోకి మార్చుకుంటాడు. దీని తరువాత, 07 ఫిబ్రవరి 2023 న..  మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు.

Bhadra Raj Yoga 2023: కొత్త ఏడాదిలో అరుదైన భద్ర రాజయోగం.. ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. పెళ్లికానివారికి వివాహ యోగం..
Budh Gochar 2023
Follow us on

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం..  ఒక వ్యక్తి జీవితంలో జరిగే మంచి, చెడు సంఘటనలు గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తి  జాతకంలో గ్రహం శుభ స్థానంలో ఉంటే,.. ఆ వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు.. అయితే వ్యక్తి జాతకంలో గ్రహం స్థానం అశుభంగా ఉంటే అతను పనిలో నిరంతర వైఫల్యాలు చెందుతాడు. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం 2023లో అడుగు పెట్టనున్నాం. కొత్త సంవత్సరంలో బుధ గ్రహం తన గమనాన్ని మార్చుకోనుంది. బుధ గృహం మేధస్సు, ప్రసంగం, సాంకేతికత, వ్యాపారానికి కారకంగా పరిగణిస్తారు. 2022 సంవత్సరం చివరి రోజుల నుండి 2023 సంవత్సరం ప్రారంభం వరకు అనేక సార్లు తన గమనాన్ని మార్చుకుంటుంది.

మొత్తం తొమ్మిది గ్రహాల్లో బుధుడును యువరాజు అని అంటారు. డిసెంబర్ 31, 2022న, బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు బృహస్పతి అధిపతి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జనవరి 18, 2023న బుధుడు ప్రత్యక్ష మార్గంలోకి మార్చుకుంటాడు. దీని తరువాత, 07 ఫిబ్రవరి 2023 న..  మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంవత్సరం ప్రారంభంలోనే బుధుడు భద్ర రాజయోగాన్ని సృష్టిస్తాడు. బుధుడు సంచారంతో సంవత్సరారంభంలో భద్ర రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది.

జ్యోతిష్యంలో భద్ర రాజయోగం

ఇవి కూడా చదవండి

పంచ మహాపురుష రాజయోగం భద్ర రాజయోగం. ఇది బుధ గ్రహం ప్రభావంతో ఏర్పడింది. ఈ యోగం ఏర్పడినప్పుడు..  వ్యక్తి  మేధస్సు పదునైనదిగా మారుతుంది. జ్ఞానాన్ని సంపాదించే శక్తి వారిలో మరింత అధికంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో.. ఈ యోగా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యోగ ప్రభావం వల్ల మనిషి జీవితంలో ఐశ్వర్యం, గౌరవం లభిస్తాయి.

జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహం శుభ, తటస్థ గ్రహంగా పరిగణించబడుతుంది. బుధుడు రెండు రాశుల యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. మిథున, కన్యా రాశులకు అధిపతి బుధ గ్రహం. సూర్యుడు, శుక్ర గ్రాహం, అంగారకుడు, చంద్రుడితో శత్రుత్వం కలిగి ఉన్న గ్రహాలు. అయితే ఎవరి జాతకంలో బుధుడు లగ్నస్థ గృహంలో ఉంటాడో.. అతను చాలా పదునైన తెలివితేటలు, వివేకం కలిగి ఉంటాడు. అంతేకాదు జాతకంలో బుధుడు మంచి స్థితిలో  లేనట్లు అయితే అటువంటి వ్యక్తులు తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులను, అప్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు, వ్యక్తి  ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. అతనికి చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతాడు.

భద్ర రాజయోగం ఏర్పడడం వల్ల 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు 

మేష, మిథున, కన్య, ధనుస్సు, మీన రాశుల వారికి భద్ర రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఈ భద్ర రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. వీరు అదృష్టాన్ని పొందుతారు.. ఈ ఐదు రాశుల వ్యక్తులు తమ తమ రంగాలలో ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. కెరీర్‌లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ యోగం వల్ల మొత్తం 5 రాశుల వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం నుండి మంచి లాభాలు పొందే సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో, డబ్బు నిలిచిపోయిన వారికి డబ్బు వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో.. ఈ రాశి వ్యక్తులు పెట్టుబడి పెట్టడం వలన మంచి డబ్బు పొందవచ్చు. వివాదాలు సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారంరంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)