Unfaithful People: ప్రస్తుత సమాజంలో నిజాయితీ అనేది చాలా కొద్ది మందిలో ఉండే సద్గుణం, పైగా అలాంటివారు చాలా అరుదు. మన చుట్టూ ఉన్నదంతా స్వార్థం, ధ్వేషం, కుట్రతత్వమే. కొందరైతే కపటత్వమే వారికి ఆభరణంగా జీవిస్తుంటారు. అలాంటివారు చెప్పే మాటలు పైకి తీపిగా ఉన్నా.. సమయం వచ్చినప్పుడు నమ్మలేనంతగా మోసం చేస్తుంటారు. నిజానికి ఇలాంటివారే నిత్యం విధ్వంసక, మోసపూరిత ఆలోచనలను కలిగి ఉంటారు. రెండు నాలుక ధోరణితో అందరినీ మోసగిస్తుంటారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారి గురించి జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొనబడిందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కొన్ని రాశులలోని వారే ఇలాంటి స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని వారు పేర్కొంటున్నారు. మరి ఏయే రాశులవారు కపటస్వభావాన్ని కలిగి ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
మిథున రాశి: మిథునరాశిలో జన్మించిన కొందరు కపటబుద్ధినే ఆభరణంగా కలిగి ఉంటారు. వాస్తవానికి ఈ రాశివారు చీమలకు కూడా హానీ తలపెట్టని స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే కొందరుచాలా భయస్తుల్లా కనిపిస్తారు. నిజానికి వీరే అసలైన విధ్వేషం కలిగి ఉంటారు. వీరి ఆలోచనలన్నీ విషపూర్తితంగా, అబద్ధాలతో నిండి ఉంటాయి. ఒకరి ముందు ఒక మాట, వెనుక మరో మాట చెబుతుంటారు.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశివారు చాలా ప్రతిష్టాత్మకమైనవారు. తమ లక్ష్యాలను సాధించడానికి ఎంతవరకైనా వెళ్లే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంకా తమకు కావలసినదాన్ని పొందడానికి వృశ్చిక రాశిలో జన్మించిన కొందరు తప్పుడు పనులు చేయడానికి కూడా వెనుకాడరు. ఇంకా అవసరమైతే ఇతరులను వేధించడానికి కూడా సిద్ధపడతారు. వీరి మనస్తత్వం పూర్తిగా విభిన్నమైనదని చెప్పుకోవాలి.పైగా తాము సున్నిత మనస్తత్వం కలిగిన వారమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, వాస్తవానికి చాలా హానీకరం.
ధనుస్సు రాశి: ధనస్సురాశిలో జన్మించినవారిలో కొందరు సంఘర్షణను ఇష్టపడరు. సంక్షోభం, గొడవలను ఎదుర్కోలేరు. వీటి నుంచి తప్పించుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైనప్పుడల్లా అబద్ధాలు చెప్పడం, ఇతరులపై అభాండాలు వేయడం వంటివి విరివిగా చేస్తుంటారు. ఇతరుల దృష్టిలో మంచివారమని అనిపించేందుకు నవ్వుతూ మాట్లాడుతుంటారు. కానీ కపట బుద్ధిని కలిగి ఉంటారు.
మీన రాశి: మీనరాశిలో జన్మించిన వ్యక్తుల్లో కొందరు ద్వేషాన్ని కలిగి ఉండరు కానీ, అబద్ధాలే తమకు పునాదులన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఆ రాశివారు ఇతర వ్యక్తులను ఎన్నడూ ఎదురుగా విమర్శించరు. వారి వెనుక విమర్శల వర్షమే గుప్పిస్తారు. పైకి నవ్వుతూ మాట్లాడినా.. లోపల మాత్రం ద్వేషిస్తారు. స్వార్థపరులు కాకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి తమ కపట బుద్ధిని ప్రదర్శిస్తారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు మత గ్రంధాలు, విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..