Favourite Zodiacs: సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాశులివే.. సర్వత్రా విజయం వీటి సొంతం.. మీ రాశి కూడా ఉందా..?

|

Apr 23, 2023 | 10:38 AM

Favourite Zodiacs of Sun: గ్రహాల రాజుగా పేరొందిన సూర్యుడికి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆత్మ, విజయం, గౌరవాలకు మూల కారణమైన సూర్యుడిని ఆదిత్యుడు, సూర్యభగవానుడు అంటూ హిందువులు పూజిస్తారు. ఇంకా సూర్యుడు స్వయంగా..

Favourite Zodiacs: సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాశులివే.. సర్వత్రా విజయం వీటి సొంతం.. మీ రాశి కూడా ఉందా..?
Favpourite Zodiacs Of Sun
Follow us on

Favourite Zodiacs of Sun: గ్రహాల రాజుగా పేరొందిన సూర్యుడికి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆత్మ, విజయం, గౌరవాలకు మూల కారణమైన సూర్యుడిని ఆదిత్యుడు, సూర్యభగవానుడు అంటూ హిందువులు పూజిస్తారు. ఇంకా సూర్యుడు స్వయంగా సింహరాశికి అధిపతి కూడా. ఇక సూర్యానుగ్రహం ఉంటే ఏ విధమైన చింతాదిగులు ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యుడిని అత్యంత ఇష్టమైన రాశులవారికి అన్నింటా విజయమే తప్ప ఓటమి అనేది కలగదంట. పైగా వారు చేసిందల్లా లాభదాయకంగా మారేలా సూర్యభగవానుడి కృప ఉంటుందని వారు వివరిస్తున్నారు. అసలు సూర్యుడికి ఇష్టమైన ఆ రాశులేమిటి..? వాటిపై సూర్యుడి అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది..? ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సింహరాశి: నవగ్రహాలకు రాజైన సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాశులలో సింహ రాశి ప్రప్రథమ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి సూర్యుడు స్వయంగా అధిపతి. సూర్యుని కృపానుగ్రహం కారణంగా సింహరాశివారు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాక ఏ కష్టం అయినా వెన్నుచూపక విరోచితమైన ధైర్యాన్ని చూపిస్తారు. సింహరాశివారిలో సహజంగా ఉండే ఆత్మవిశ్వాసం కూడా ఇందుకు గల మరో కారణం. అలాగే సింహారాశివారు ఆదివారం సూర్యోదయ సమయంలో ఆయనకు నీటితో అర్ఘ్యం సమర్పించడం వల్ల మరింతగా మేలు జరుగుతుంది.

మేషరాశి: సూర్యునికి ఇష్టమైన రాశులలో మేష‌రాశి కూడా ఉంది. ఈ రాశికి అంగారకుడు(కుజుడు) అధిపతి. సూర్యానుగ్రహం వల్ల మండే అగ్నిగోళపు కాంతిలా మేషరాశివారిలో ధైర్యం పెరుగుతుంది. సూర్యుడు మీలో కొత్త శక్తి, ఉత్సాహన్ని నింపుతాడు. అయితే ఈ రాశివారి మనసులోని అస్థిర భావం వీరికి అతి పెద్ద బలహీనత అని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా మేషరాశివారు ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించడంతో పాటు ఆయనకు నమస్కారం చేయడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: దేవతల గురువైన బృహస్పతి ధనుస్సు రాశికి అధిపతి. గురుగ్రహ అధినంలో ధనస్సు రాశి ఉన్న కారణంగా ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతో సహనం వహిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పైగా ధనస్సురాశి సూర్యుడిని ఇష్టమైన రాశి కావడం వల్ల ఆయన అనుగ్రహం వీరిపై ఎల్లప్పుడూ  ఉంటుంది. ఫలితంగా ధనస్సు రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోకపోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకోవడం ధనస్సురాశివారికి ఉన్న అతి పెద్ద బలహీనత. అందువల్ల ఈ రాశివారు సూర్యుడిని పూజించడం మంచిది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).