AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: మొదట్లో కష్టాలున్నా.. ఈ తేదీల్లో పుట్టినవారికి భవిష్యత్తులో తిరుగుండదట

సంఖ్యాశాస్త్రం ప్రకారం నెలలో 8, 17 లేదా 26 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 8 అవుతుంది. ఈ సంఖ్యకి అధిపతి శని. శని న్యాయం కోసం నిలబడే గ్రహంగా పరిగణించబడతాడు. ఇతడు ఎవరినీ వదలడు, మంచి చెడు ఏది చేసినా ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే ఈ తేదీల్లో జన్మించిన వారు జీవితంలో మొదట కష్టాలు పడతారు.. కానీ తర్వాత గొప్ప విజయాన్ని పొందుతారు.

Numerology: మొదట్లో కష్టాలున్నా.. ఈ తేదీల్లో పుట్టినవారికి భవిష్యత్తులో తిరుగుండదట
Numerology Secrets
Prashanthi V
|

Updated on: May 10, 2025 | 2:40 PM

Share

సంఖ్యాశాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన జ్ఞానం. దీని సహాయంతో మనం వ్యక్తుల స్వభావం, ప్రవర్తన, ఆలోచనలు, భవిష్యత్తు వంటి విషయాలు అంచనా వేసే అవకాశం ఉంటుంది. హిందూ మతంలో దీనికి ప్రాధాన్యం ఉంది. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఒక సంఖ్య వస్తుంది. దానినే మూల సంఖ్య అంటారు. ఈ సంఖ్యనే ఆధారంగా తీసుకుని వ్యక్తి జీవితం గురించి ముందే ఊహించవచ్చు.

8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు సాధారణంగా నిశ్చలమైన స్వభావం కలిగివుంటారు. ఏ పని అయినా శాంతిగా ఆలోచించి చేస్తారు. వారి మాటలు కచ్చితంగా ఉంటాయి. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పాటించేందుకు ప్రయత్నిస్తారు. అంతే కాకుండా వారు ఇతరులకు సాయం చేయడంలో కూడా ముందుంటారు.

మూలసంఖ్యా 8 ఉన్న వారు చదువు విషయంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. సాధారణంగా వారి అభ్యాసంలో ముందుగా ఫలితాలు కనపడకపోయినా.. ప్రయత్నం చేస్తే విజయం ఖచ్చితం. టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో ఈ తేదీల్లో పుట్టినవారికి మంచి శ్రద్ధ, తెలివి ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే వారి కృషి ప్రధానమైనది.

ఈ తేదీల్లో పుట్టినవారు న్యాయాన్ని గౌరవిస్తారు. వారు ఎవరికీ అన్యాయం జరగనివ్వరు. డబ్బు సంపాదించడంలో కూడా నిజాయితీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇతరుల దూషణలు పట్టించుకోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నైతిక విలువలు పాటిస్తూ జీవితాన్ని ముందుకు నడిపిస్తారు.

మూలసంఖ్యా 8 ఉన్నవారు ప్రేమ జీవితంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారు నిజమైన ప్రేమను నమ్ముతారు. ఒకసారి ప్రేమించాక సంబంధాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో శ్రమిస్తారు. వారి ప్రేమలో నిబద్ధత ఉంటుంది. అంతే కాకుండా వారి భాగస్వామికి నమ్మకమైన వారిగా నిలబడుతారు.

ఈ సంఖ్యలో పుట్టినవారు మొదట్లో కష్టపడతారు. కానీ దాని వల్ల జీవితంలో పెద్ద విజయాలు అందుకుంటారు. డబ్బు, పేరు, గౌరవం అన్నీ తర్వాత వస్తాయి. కాబట్టి నెమ్మదిగా, నమ్మకంతో ముందుకెళ్తే కచ్చితంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..