
Shani Dosha Remedies
Lord Shani 2026 Horoscope: కొత్త సంవత్సరంలో ఎక్కువ కాలం శని ఒంటరిగా, స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రస్తుతం శని దోషంలో ఉన్న రాశుల వారు దీనివల్ల బాగా కష్టనష్టాలకు గురయ్యే అవకాశం ఉంది. ఏడాది ప్రారంభంలో శనికి కొద్దిపాటి పరిహారాలు చేసే పక్షంలో వీరికి ఏడాదంతా శని వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. శనికి తరచూ దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయడం, నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించడంతో పాటు తరచూ శివార్చన చేయించడం వల్ల కూడా శని యోగదాయకంగా మారే అవకాశం ఉంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఈ పరిహారాలు పాటించడం చాలా మంచిది.
- మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కొనసాగుతున్నందువల్ల ఈ రాశివారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం చేయవలసిన అవసరం కలుగుతుంది. బంధుమిత్రుల వల్ల నష్టపోవడం, మోసపోవడం వంటివి జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశివారు తప్పనిసరిగా శనికి పరిహారాలు చేయించడం మంచిది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అష్టమ శని దోషం కలిగింది. అష్టమ శని వల్ల అష్టకష్టాలు పడడం జరుగుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇష్టమైన బంధుమిత్రులు ఏదో ఒక కారణం వల్ల దూరమవుతారు. ఒంటరి జీవితం, ఒంటరి పోరాటం తప్పనిసరవుతుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కొనసాగుతాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా శనిని సంతృప్తిపరడం ఉత్తమం. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి.
- కన్య: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏ ప్రయత్నమూ నెరవేరదు. ఆలస్యాలు, కాలయాపనలు, వ్యయ ప్రయాసలు, శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. శనికి తరచూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. ఆదాయ వృద్ధికి, ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం కలుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని తిష్ఠ వేయడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. మానసికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో సుఖ శాంతులు తగ్గుతాయి. ఆస్తి వివాదాలు, సమస్యలు ఒత్తిడి పెడతాయి. సామాజిక ప్రాభవం తగ్గుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉండదు. గృహ ప్రయత్నాల్లో సమస్యలు ఎదురవుతాయి. శుభకార్యాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. శనికి తరచూ దీపారాధన చేయడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది.
- కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కొనసాగుతోంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు. ఆర్థిక అవసరాలు తీరకపోవడం జరుగుతుంది. బంధుమిత్రులతోనూ, కుటుంబ సభ్యులతోనూ అపార్థాలు తలెత్తుతాయి. ఏ పనీ ఒక పట్టాన కలిసి రాదు. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. పనిభారం, పని ఒత్తిడి పెరుగుతాయి. శనికి తరచూ దీపం వెలిగించడంతో పాటు శివార్చన చేయించడం చాలా మంచిది.
- మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కొనసాగుతోంది. దీనివల్ల వ్యక్తిగత పురోగతి స్తంభించిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. అనారోగ్య సమస్యలుచికాకు పెడతాయి. బంధుమిత్రులు దూరమవుతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. శుభ కార్యాలు వాయిదా పడుతుంటాయి. శనికి ప్రదక్షి ణలు చేయడం, శివార్చన చేయించడం వల్ల ఈ రాశివారికి దశ తిరిగే అవకాశం కలుగుతుంది.