Money Astrology 2026: కొత్త సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో ఆ రాశులు జాగ్రత్త..!

Money Horoscope 2026: కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గ్రహ సంచారం అనుకూలించకపోవడం వల్ల డబ్బు లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో నష్టాలు, మోసాలు జరిగే ప్రమాదం ఉంది. మేషం, వృషభం, సింహం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ఇది మరింత వర్తిస్తుంది. ఆర్థిక బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించడం శ్రేయస్కరం.

Money Astrology 2026: కొత్త సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో ఆ రాశులు జాగ్రత్త..!
Money Astrology 2026

Edited By:

Updated on: Dec 26, 2025 | 4:10 PM

కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఈ రాశుల వారు డబ్బు ఇవ్వడం, తీసుకోవడం, ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం వంటివి పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం. ఆర్థికంగా నష్టపోవడం, మోసపోవడం, చేతిలో డబ్బు నిలవకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, ధనుస్సు, కుంభం, మీన రాశులవారు ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యతను జీవిత భాగస్వామికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ అప్పగించడం శ్రేయస్కరం.

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో లాభాధిపతి శని సంచారం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవడం లేదా దుర్వ్యయం కావడం గానీ జరుగుతుంది. కొందరు బంధుమిత్రులు ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో మోసగించడం లేదా నష్టపరచడం జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టిన పెట్టుబడులు కూడా ఆశించిన లాభాలను కలిగించే అవకాశం ఉండదు. ఈ రాశి వారు జూన్ నెల పూర్తిగా గడిచే వరకు ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
  2. వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయంలో ఎక్కువ భాగం ఉచిత సహాయాలకు, దానధర్మాలకు, నష్టదాయక వ్యవహారాలకు వృథా చేసే అవకాశం ఉంది. తృతీయ స్థానంలో జూన్ నుంచి సంచారం చేయబోతున్న గురువు వల్ల వీరు ఈ ఏడాది ద్వితీయార్థమంతా ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఖర్చులు అదుపు తప్పడం జరుగుతుంది. మితిమీరిన ఔదార్యం వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో జూన్ తర్వాత నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యయ స్థానంలో ధన కారకుడు గురువు ప్రవేశిస్తున్నందువల్ల చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. నష్టదాయక వ్యవహారాలను చేపట్టడం వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది. బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించడం వల్ల కూడా ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో గానీ, షేర్ల మీద గానీ పెట్టుబడులు పెట్టకపోవడం ఈ రాశివారికి మంచిది.
  4. ధనుస్సు: ధన కారకుడు, రాశ్యధిపతి అయిన గురువు జూన్ నుంచి అష్టమ స్థానంలో సంచారం చేయడం, అర్ధాష్టమ శని జరుగుతుండడం వల్ల ఈ రాశివారు ఆర్థిక విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంవల్ల, వ్యాపారాలు ప్రారంభించడం వల్ల వీరు బాగా నష్టపోవడం జరుగుతుంది. ఉచిత సహాయాలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల కూడా ధన వ్యయం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. జూన్ వరకు ఆదాయం వృద్ది చెందుతుంది.
  5. కుంభం: ఈ రాశికి ఏలిన్నాటి శని దోషం కలగడం వల్ల ఆదాయం పెరిగే అవకాశాలు తక్కువ. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద వ్యయం బాగా పెరుగుతుంది. ఇతరులకు రుణంగా లేదా సహాయంగా ఇచ్చే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యతను నమ్మకస్థులకు అప్పగించడం మంచిది.
  6. మీనం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని జరుగుతుండడం, వ్యయ స్థానంలో రాహువు సంచారం, జూన్ తర్వాత నుంచి గురువు ఆరవ స్థానంలో ప్రవేశించడం వంటి కారణాల వల్ల వీరికి ఈ సంవత్సరమంతా ఆర్థిక విషయాల్లో ఆటుపోటులు తప్పకపోవచ్చు. అనేక విధాలుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కూడా సవ్యంగా సాగకపోవచ్చు. బంధుమిత్రుల వల్ల నష్టం ఎక్కువగా జరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కూడా జరుగుతుంది.