Telugu Astrology
నవంబర్ 1 నుంచి 15 వరకూ చంద్రుడు వృశ్చిక రాశి నుంచి మేష రాశి వరకూ సంచారం చేయడం జరుగుతోంది. ఈ ఆరు రాశుల్లో సంచారం వల్ల చంద్రుడికి బాగా బలం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన శుభ గ్రహాలతో చంద్రుడికి అనుకూలతలు ఏర్పడడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ఆదాయం, ఉద్యోగం, ఆస్తి, కుటుంబ వ్యవహారాల్లో బాగా అనుకూలతలు పెరగడంతో పాటు, కీలకమైన శుభ పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఈ రాశులవారి జీవితాలు నవంబర్ నెలలో మొదటి పక్షం రోజులు కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంటుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉద్యో గాలు లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం, భద్రత కలుగుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతాలకు విహార యాత్ర చేస్తారు.
- మిథునం: ఈ రాశికి ధనాధిపతి అయిన చంద్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో వేతనాలు పెరుగుదలకు, వృత్తి, వ్యాపారాల్లో లాభాల వృద్ధికి అవకాశం ఉంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామా జికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరిగి పలుకుబడి విస్తరిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. జీవన శైలి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.
- కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడికి బలం పెరిగినందువల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. భూ లాభం కలుగుతుంది. పిత్రా ర్జితం లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశా లకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు, వివాదాలు సమసిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి.
- వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు శుభ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పడ తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి అన్ని విధాలైన సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన చంద్రుడు అనుకూలంగా సంచారం చేయడం వల్ల ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలుం టాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.