Moon Transit
M oon Transit: ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చంద్రుడు రెండు శుభ యోగాలను కలిగించడం జరుగుతోంది. మనఃకారకుడైన చంద్ర గ్రహం మనసులోని కోరికలు తీర్చడానికి ప్రాధాన్యమిస్తాడు. మీ మనసులోని కోరికల్లో కొన్నిటిని ఆ నాలుగైదు రోజుల కాలంలో తీర్చే అవకాశం ఉంది. చంద్రుడు తల్లికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, సత్సంబంధాలకు కూడా కారకుడు. ఈ నాలుగైదు రోజుల్లో ప్రారంభించే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలు, వేసే పథకాలు మున్ముందు తప్పకుండా ఫలించే అవకాశం ఉంటుంది. చంద్రుడు 7వ తేదీ సాయంత్రం నుంచి మేషంలో ప్రవేశిస్తాడు. దీనివల్ల కుజుడితో పరివర్తన యోగం కలుగుతుంది. ఇక 9వ తేదీ నుంచి ఉచ్ఛపట్టి, గురువుతో యుతి చెందుతాడు. దీనివల్ల గజకేసరి యోగం కలుగుతుంది. ఈ రెండు యోగాల వల్ల మేషం, కర్కాటకం, సింహం, కన్య, మకర, మీన రాశులు బాగా లబ్ది పొందుతాయి.
- మేషం: రాశ్యధిపతి కుజుడితో చంద్రుడు పరివర్తన చెందడం వల్ల, ఆ తర్వాత ధన స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి ఏడు రోజుల కాలం వైభవంగా, సంతృప్తికరంగా సాగిపో తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నమైనా తప్పకుండా సఫలం అవుతుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం, హోదా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది.
- కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడితో కుజుడికి పరివర్తన ఏర్పడడం, లాభస్థానంలో రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛ పట్టడం, అక్కడ గజకేసరి యోగం ఏర్పడడం వగైరా కారణాల వల్ల వీరికి రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందు తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్న తులు కలుగుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాలార్జిస్తాయి.
- సింహం: ఈ రాశికి భాగ్యాధిపతితో చంద్రుడు పరివర్తన చెందడం వల్ల విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలు గుతుంది. దశమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశికి అష్టమాధిపతి కుజుడితో లాభాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం, భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. భూ లాభం కలుగు తుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.
- మకరం: ఈ రాశివారికి చతుర్థ, సప్తమాధిపతుల పరివర్తన వల్ల చంద్ర మంగళ యోగం కూడా కలిగింది. ఈ అయిదు రోజుల్లో గృహ ప్రయత్నాలు చేపట్టే పక్షంలో తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరు తుంది. అనుకోకుండా ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. పంచమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మీనం: ఈ రాశికి ధన, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం ఒక విశేషం కాగా, తృతీయంలో రాశ్య ధిపతి గురువు, ఉచ్ఛ చంద్రుడు కలుసుకోవడం వల్ల ఉన్నత స్థాయి గజకేసరి యోగం ఏర్పడింది. ఈ రెండు యోగాల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మున్నెన్నడూ లేనం తగా మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్లు వేస్తారు. అనుకున్న పనులు, ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.