Moon Astrology: వృషభ రాశిలోని చంద్రుడి ప్రభావం.. ఆ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి..!

| Edited By: Janardhan Veluru

Jan 20, 2024 | 6:33 PM

మనఃకారకుడైన చంద్రుడు 20, 21, 22 తేదీలలో వృషభ రాశిలో ఉచ్ఛ పడుతున్నందువల్ల ఏడు రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరబోతున్నాయి. ఆ మూడు రోజుల్లో ఎటువంటి ఆలోచన చేసినా, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి సంకల్పం చేసినా అది తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా, ఈ మూడు రోజులూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పోతాయి.

Moon Astrology: వృషభ రాశిలోని చంద్రుడి ప్రభావం.. ఆ రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి..!
Zodiac Signs
Follow us on

మనఃకారకుడైన చంద్రుడు 20, 21, 22 తేదీలలో వృషభ రాశిలో ఉచ్ఛ పడుతున్నందువల్ల ఏడు రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరబోతున్నాయి. ఆ మూడు రోజుల్లో ఎటువంటి ఆలోచన చేసినా, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి సంకల్పం చేసినా అది తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా, ఈ మూడు రోజులూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు ఒకటి రెండు శుభవార్తలు, శుభ పరిణామాలకు అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి తప్పకుండా అభీష్ట సిద్ధి యోగం పడుతుంది. ఈ రాశుల వారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.

  1. మేషం: ఈ రాశివారికి ధన స్థానంలో చంద్రుడు ఉచ్ఛస్థితికి చేరుకుంటున్నందువల్ల ఆర్థికపరంగా మన సులో ఎటువంటి కోరిక ఉన్నా, ఆశ ఉన్నా అది తప్పకుండా నెరవేరుతుంది. తల్లి వైపు నుంచి ధన సహాయం అందే అవకాశం కూడా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దాదాపు అన్ని మార్గాలలోనూ ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. ఆశించిన శుభ వార్తలు అందడంతో పాటు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  2. వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల, వీరికి అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల, సోదరుల వల్ల, సలహాలు, సూచనల వల్ల ఆర్థికంగా లబ్ది పొందడం జరుగు తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న తీర్థయాత్రలు, విహార యాత్రలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మనశ్శాంతిగా, ప్రశాంతంగా కాలం గడిపే అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆర్థికంగా అనేక విధాలుగా లాభం చేకూరే అవకాశం ఉంది. జీతభత్యాలు, రాబడి, లాభాలపరంగా తప్పకుండా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు లాభకరంగా, ఆశాజనకంగా మారతాయి. మంచి జీతభత్యా లతో ఉద్యోగం లభించడానికి, ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో మీ హవా నడుస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
  4. కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఎటువంటి ప్రయత్నమైనా సఫలం కావడం, మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విదేశీ సంబంధమైన వ్యవహారాల్లో శుభవార్తలు అందుతాయి. కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తండ్రి వైపు నుంచి సంపద చేతికి అందుతుంది. ఇష్టమైన తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛపట్టడం వల్ల తప్పకుండా మనసులోని కోరికలు నెర వేరుతాయి. అప్రయత్న ధన లాభముంటుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. విహార యాత్రలు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. అనూహ్యంగా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఊపందు కుంటాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాబల్యం పెరుగతాయి. ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి.
  6. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛ స్థితికి వెడుతున్నందువల్ల ఈ రాశివారికి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించడంతో పాటు, ఉద్యోగం మారాలనుకునేవారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి రావడం, వారి నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రేమ ప్రయత్నాలు ఫలిస్తాయి.
  7. కుంభం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఈ రాశివారి ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. అనేక విషయాలు అనుకూలంగా మార డం వల్ల, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వల్ల మానసికంగా ఊరట చెందుతారు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలం గడుపుతారు. తల్లి వైపు నుంచి అనేక విధాలుగా ప్రయోజ నాలు పొందుతారు. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.