మాస ఫలాలు (మార్చి 1 నుంచి మార్చి 31, 2024 వరకు): మేష రాశి వారికి ఈ నెలంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. గురువు, శనితో పాటు ఇతర గ్రహాల బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి నెలంతా బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మిథున రాశి వారికి గురు, శని, రాశ్యధిపతి బుధుడి అనుకూలతలు బాగా ఉన్నందువల్ల నెలంతా ప్రశాంతంగా, విజయవంతంగా గడిచిపోతుంది.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):
ఈ నెలంతా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. గురువు, శనితో పాటు ఇతర గ్రహాల బలం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఏ ప్రయ త్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయ లుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విద్యార్థు లకు అను కూలతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం మీద మాత్రం ఒక కన్ను వేసి ఉండడం మంచిది. భరణి నక్షత్రం అదృష్టం కలిసి వస్తుంది. వినా యకుడిని పూజించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
నెలంతా బాగా అనుకూలంగా ఉంది. బుధ, రవి, కుజ, శుక్ర గ్రహాలు రాశులు మారడం ఈ రాశివారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తే అంత మంచిది. ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపో తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యా దలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాదిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొన్ని రకాల ఇబ్బందులు తప్పకపోవచ్చు. కృత్తికా నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రాభవం పెరుగు తుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువు కోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
గురు, శని, రాశ్యధిపతి బుధుడి అనుకూలతలు బాగా ఉన్నందువల్ల నెలంతా ప్రశాంతంగా, విజయవంతంగా గడిచిపోతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఇష్టమైన వ్యక్తిల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముగుస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు ఈ రాశివారి మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. పునర్వసు వారికి మరింతగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
ఈ నెలంతా చాలావరకు మిశ్రమంగా గడిచిపోతుంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంగుంది. కుజ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. కొన్ని సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏ విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తల్లితండ్రులు, సోదర వర్గంతో సామరస్యం నెలకొంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిత్రుల వల్ల ఇబ్బంది పడ తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. పుష్యమి వారికి శుభ యోగాలు పడతాయి. శివార్చన చేయించడం చాలా మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
గ్రహాల అనుకూలతలు తక్కువగా ఉన్నందువల్ల నెలంతా కొద్దిపాటి ఒడిదుడుకులతో సాగి పోతుంది. శని, కుజుల ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఏ పనైనా శ్రమతో పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి నిల కడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. బంధువుల రాకపోకలు ఉండవచ్చు. వ్యక్తిగతంగా ఒకటి రెండు సమస్యలు పరిష్కారం కావచ్చు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. ఉద్యోగంలో అధికా రులు, సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. సకాలంలో ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందివస్తాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడడం, ఒకటి రెండు సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చ వద్దు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి చోటు చేసు కుంటుంది. పుబ్బా నక్షత్రం వారు శుభవార్తలు వింటారు. తరచూ శివార్చన చేయించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
గ్రహ బలం బాగానే అనుకూలంగా ఉంది. నెలలో ప్రథమార్థం బాగానే ఉంటుంది కానీ, అంతకంటే ద్వితీయార్థం మరింత మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం గురు, కుజ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు, వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొం టారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు పనిభారం బాగా పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వృత్తి జీవి తంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమ యం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఉత్తరా నక్షత్రం వారికి ఆకస్మిక ధన యోగం ఉంది. విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. గురు, శుక్ర, బుధ గ్రహాలతో పాటు రాశ్యధిపతి అయిన కుజుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల దాదాపు పట్టుకుందల్లా బంగారం అవుతుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ప్రాధా న్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తుల్లో ఉన్నవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపా రాల్లో కూడా ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఏ విషయంలోనూ ఓటమి దగ్గరికి రాకపోవచ్చు. ఇతరు లకు మేలు జరిగే పనులు చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తల్లి తండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు చక్క బడ తాయి. విదేశాల నుంచి ఉద్యోగులకు, నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి మంచి యోగం పడుతుంది. లలితా సహస్ర నామం చదువుకోవడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):
నెలంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుంది. బుధ, శుక్ర, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో అనేక సానుకూలతలు చోటు చేసుకుంటాయి. అధికా రులు గట్టి నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. కొన్ని పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అర్ధాష్టమ శని కారణంగా ముఖ్యమైన విషయాల్లో, నిర్ణయాలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరించడం, అప్రమత్తంగా ఉండడం మంచిది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు ఫలించి, లాభాల పంట పండుతుంది. నిరు ద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరో గ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవ హారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి శుభ వార్తలు అందుతాయి. దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
ఈ రాశివారికి ఈ నెలంతా దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉండడం వల్ల దాదాపు రాజ యోగంగా సాగిపోతుంది. అనేక శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ధన యోగాలు పడతాయి. ఆదాయం మెరుగ్గా ఉండడం, ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిం చడం, వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. పంచమ స్థానంలో ఉన్న గురు గ్రహం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అను కూలతలు పెరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి మరింతగా కలిసి వస్తుంది. తరచూ సుందరకాండ పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
నెలంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది. శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించినవి, కోరుకున్నవి చాలావరకు జరిగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. రవి, బుధ, శుక్రుల శుభ యోగం వల్ల వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. గృహ, వాహన సంబంధమైన సౌకర్యాల మీద దృష్టి పెడ తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రాజయోగం పడుతుంది. తరచూ వినాయకుడికి అర్చన చేయించడం చాలా మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
నెలంతా సానుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఈ రాశివారికి ప్రస్తుతం గురు, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించకపోవచ్చు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు కాలం బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత పెరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువు కోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
రాశ్యధిపతి గురువు ధన స్థానంలో ఉండడంతో పాటు లాభ స్థానం శుభ గ్రహాలతో నిండి ఉన్నం దువల్ల ధన వ్యవహారాలన్నీ బాగా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి. నెలంతా మనశ్శాంతిగా గడిచిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందు కుంటారు. ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ స్థిరత్వం ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. పోటీదార్లు, ప్రత్యర్థులు దూరమవుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బంది పెడతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పదోన్నతి లభించవచ్చు. తరచూ శివార్చన చేయడం మంచిది.