Money Horoscope
కుజ, రాహువుల్ని పాప గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం మీన రాశిలో కలిసి ఉన్నాయి. ఇందులో కుజుడు జూన్ 1 వరకూ ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఈ రెండు గ్రహాలు ధన కారకుడైన గురువుకు చెందిన మీన రాశిలో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి ధన యోగాలు పట్టబోతున్నాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి రావడం అనేది ఈ రెండు గ్రహాల కలయిక ప్రత్యేకత. ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న సమయంలో ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సిరులు పండిస్తుంది. వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు ఈ ధన యోగం పూర్తి స్థాయిలో వర్తించే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, రాహువుల సంచారం వల్ల కేవలం ధన యోగమే కాక, ఈ రాశివారికి అధికార యోగం, ఆరోగ్య యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్న సమయంలో వీరు రియల్ ఎస్టేట్, లిక్కర్, బ్రోకరేజ్, మార్కెటింగ్, సేల్స్ వంటి రంగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సంపద బాగా కలిసి వస్తుంది. ధన ప్రవాహం ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
- మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరిగినందువల్ల, వృత్తి, ఉద్యోగాల ద్వారా అపార ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు రియల్ ఎస్టేట్, రాజకీయాలు, ఆస్పత్రులు, వైద్యం, టూరిజం వంటి రంగాల్లో ఉన్న పక్షంలో వారు చేపట్టే ఎటువంటి ప్రయత్నమైనా సిరులు కురిపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలు, వెంచర్లు లాభాలను పండిస్తాయి.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో ఈ రెండు పాప గ్రహాల యుతి జరగడం ఈ రాశివారి అదృష్టం. రియల్ ఎస్టేట్, భూములు, లిక్కర్, రాజకీయాలు వంటి రంగాల వారితో పాటు ఇతరులు కూడా ఏ కొత్త ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం కావడంతో పాటు ఇబ్బడిముబ్బడిగా రాబడి సమకూరుతుంది. ఇది వరకు చేపట్టిన ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ప్రతి పనీ అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. నష్టాల నుంచి, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ కోణంలో రాశ్యధిపతి కుజుడు రాహువుతో కలిసి సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారి ఆలోచనలు, నిర్ణయాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారు తమ వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నమూ సిరులు కురిపిస్తుంది. కొద్ది ప్రయత్నంతో వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆస్పత్రులు, ఆరోగ్యం, వడ్డీ వ్యాపారం, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి సంపన్న జీవితం లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ, రాహువులు కలవడం వల్ల చొరవ, ధైర్యం పెరిగి, అనేక అనుకూలతలను కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో అంచనాలకు మించిన శుభ ఫలితాలను అందుకుంటారు. ప్రయాణాల వల్ల బాగా లాభం పొందుతారు. టూరిజం రంగంలో ఉన్నవారు, గైడ్లు లాభాలు పండిం చుకుంటారు. భూ సంబంధమైన ఆస్తి కలిసి వస్తుంది. ప్రతి రంగంలోనూ ప్రాధాన్యం పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో ఈ రెండు గ్రహాల యుతి జరిగినందువల్ల ఇదివరకు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో పాటు, ఇప్పుడు చేపట్టే ప్రయత్నాలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. డాక్లర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా లాభాలను అందుకుంటారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. మార్కెటింగ్, టూరిజం వంటి రంగాల వారు ఆర్థికంగా స్థిరపడతారు.