Dhana Yoga
ఈ నెల 29, 30, 31 తేదీల్లో వృషభ రాశిలో చంద్ర, కుజ, గురులు కలిసి ఉండడం జరుగుతోంది. ఇక్కడ చంద్రుడు ఉచ్ఛపట్టడం ఒక విశేషం కాగా, చంద్రుడు గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం, కుజుడితో కలవడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడడం మరో విశేషం. గజకేసరి, చంద్ర మంగళ యోగాల వల్ల ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది.
- మేషం: ఈ రాశివారికి ధన స్థానంలో ధన యోగాలు పట్టడం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగు తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో అంచనాలకు మించి జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన సౌక ర్యాలకు ప్లాన్లు వేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఆఫర్లు అందుతాయి.
- వృషభం: ఈ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నం దువల్ల అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరు తాయి. ఉద్యోగంలో ప్రాభవం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి పరిచయాలు విస్తరిస్తాయి. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. జీవనశైలి మారుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, రెండు ధన యోగాలు కూడా పడుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల దిశగా సాగుతాయి. ఆస్తులు కొనే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో ధన యోగాలు ఏర్పడినందువల్ల జీవితంలో కనీ వినీ ఎరుగని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్రయత్న ధన లాభం ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగం లభించడానికి అవ కాశం ఉంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. ఇంట్లో త్వరలో శుభ కార్యాలు చేయడం జరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
- వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శుభ యోగాలు చోటు చేసుకున్నందువల్ల సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదరడం, సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం, దాంపత్య జీవితంలో వివాదాలు, విభే దాలు పరిష్కారమై, సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి. భూ సంబంధమైన ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టుకేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.
- మకరం: ఈ రాశికి పంచమ కోణంలో శుభ యోగాలు సంభవించినందువల్ల, తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగులు వ్యాపారాలు, షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దాంపత్య జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి.