Money Astrology: కన్యా రాశిలో కేతువు సంచారం.. ఆ రాశుల వారికి ధన యోగాలు పక్కా..! అందులో మీ రాశి ఉందా..?

| Edited By: Janardhan Veluru

Mar 16, 2024 | 8:39 PM

జ్యోతిష శాస్త్రంలో కేతువు ఒక మిస్టరీ గ్రహం. జాతక చక్రంలో ఈ గ్రహం అనుకూలంగా ఉండే పక్షంలో త్వరితగతిన ఆదాయ వృద్ధితో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. మోక్ష కారకుడుగా పేరున్న ఈ గ్రహం ప్రస్తుతం ఈ ఏడాదంతా కన్యా రాశిలో సంచారం చేస్తోంది. మీన రాశిలో సంచారం చేసే ప్రతి గ్రహమూ ఈ కేతువును వీక్షిస్తుంది. ఫలితంగా ఈ గ్రహ లక్షణాలలో మార్పు వచ్చి ఆకస్మిక ధన లాభానికి అవకాశం కల్పిస్తుంది.

Money Astrology: కన్యా రాశిలో కేతువు సంచారం.. ఆ రాశుల వారికి ధన యోగాలు పక్కా..! అందులో మీ రాశి ఉందా..?
Money Astrology 2024
Follow us on

జ్యోతిష శాస్త్రంలో కేతువు ఒక మిస్టరీ గ్రహం. జాతక చక్రంలో ఈ గ్రహం అనుకూలంగా ఉండే పక్షంలో త్వరితగతిన ఆదాయ వృద్ధితో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. మోక్ష కారకుడుగా పేరున్న ఈ గ్రహం ప్రస్తుతం ఈ ఏడాదంతా కన్యా రాశిలో సంచారం చేస్తోంది. మీన రాశిలో సంచారం చేసే ప్రతి గ్రహమూ ఈ కేతువును వీక్షిస్తుంది. ఫలితంగా ఈ గ్రహ లక్షణాలలో మార్పు వచ్చి ఆకస్మిక ధన లాభానికి అవకాశం కల్పిస్తుంది. ఈ విచిత్ర, మార్మిక గ్రహం వల్ల ఏయే రాశుల వారు ఆదాయపరంగా ప్రఖ్యాతులయ్యేదీ ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేషం: ఆరవ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ రాశివారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఎటువంటి సమ స్యలు, ఆటంకాలున్నా తొలగిపోతాయి. దేన్నయినా అవసరమైతే పోరాడి సాధించుకుంటారు. శత్రువులు, పోటీదార్లు, ప్రత్యర్థుల్లో భయాన్ని నింపుతారు. ఆదాయం క్రమంగా పెరగడమే తప్ప తరగడం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో క్రమబద్ధమైన పురోగతి ఉంటుంది. సేవా కార్యక్రమాల్లోనూ, దైవ కార్యాల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
  2. వృషభం: పంచమ స్థానంలో సంచారం వల్ల ఈ రాశివారు సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఈ రాశివారి సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు బాగా పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. దాంతో పాటే ఔదార్యం కూడా పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. ఆగి పోయిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు అందడం మొదలవుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవు తుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. జీవితంలో అనేక సానుకూల మార్పులు, మలుపులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఈ రాశివారికి ఎటు చూసినా లాభాలే అందే అవకాశం ఉంటుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ లాభదాయకమవుతుంది. ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం ఆశించిన స్థాయిలో మెరుగు పడుతుంది. ఊహించని విధంగా జీవితం మారిపోతుంది. కొన్ని కీలక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరిగి, చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది.
  5. ధనుస్సు: కెరీర్ సంబంధమైన యోగాలు పట్టడానికి కేతువు దశమ స్థాన సంచారం అవకాశం కల్పిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి సమస్యలు, ఆటంకాలున్నా తొలగిపోయి వేగవంతమైన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సమూలంగా మారిపోతుంది. ఇంటా బయటా సుఖ సంతోషాలకు, గౌరవ మర్యాదలకు కొదవ ఉండదు. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరి చయాలు బాగా పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను, ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు.
  6. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో కేతు సంచారం వల్ల తప్పకుండా భాగ్యం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆస్తి కలిసి వస్తుంది. పితృ భాగ్యానికి కూడా అవకాశం ఉంది. అనేక పుణ్యక్షేత్రాలను, ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు.