Mercury Transit 2023: ఆ రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి.. మేషంలో బుధుడి సంచారం ఏయే రాశులకు శుభప్రదం అంటే.. ..

|

May 24, 2023 | 1:22 PM

Mercury Transit 2023: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక ఈ జ్యోతిష్యం ప్రకారం నవ గ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని పన్నెండు రాశులపై కూడా ప్రత్యేకమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. అంటే నవ గ్రహాల కదలికలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపించగలవు. ఈ క్రమంలోనే..

Mercury Transit 2023: ఆ రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి.. మేషంలో బుధుడి సంచారం ఏయే రాశులకు శుభప్రదం అంటే.. ..
Mercury Transit 2023
Follow us on

Mercury Transit 2023: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక ఈ జ్యోతిష్యం ప్రకారం నవ గ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని పన్నెండు రాశులపై కూడా ప్రత్యేకమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. అంటే నవ గ్రహాల కదలికలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపించగలవు. ఈ క్రమంలోనే గ్రహాల రాకుమారుడిగా పేరున్న బుధుడు జూన్ 7న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులు అమితంగా లాభపడనున్నాయి. ఫలితంగా ఆయా రాశులవారికి అనూహ్య ధన సంపద, ఉద్యోగ ప్రాప్తి, పదోన్నతి లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అదృష్టరాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

ధనస్సు రాశి: మేషరాశిలో బుధ గ్రహ సంచారం ధనస్సు రాశివారికి శుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, వృద్ధులకు ఆరోగ్య స్థిరత్వం, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయి.

కుంభ రాశి: కుంభరాశివారికి కూడా మేషరాశిలో బుధ గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక లాభాలు కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: మిథున రాశివారికి జూన్ 7 వరకూ ఊహించని లాభాలు కలుగుతాయి. వృత్తిపరంగా అభివద్ధి, ఊహించని ధనలాభం, ఆరోగ్యం కలుగుతాయి.

కర్కాటక రాశి: మేషరాశిలో బుధగ్రహ సంచారంతో కర్కాటక రాశివారికి అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు, ఉద్యోగం మార్పిడి, పదోన్నతి, ఇంక్రిమెంట్లు.. వ్యాపారులకు వ్యాపారాభివృ‌ద్ధి ఉంటాయి.