Lucky Zodiac Signs: వృషభ రాశిలోకి బుధుడు.. ఈ రాశులకు అదృష్టం తలుపు తట్టబోతోంది..!

Mercury Transit 2025: మే 24 నుండి జూన్ 14 వరకు బుధుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీని ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారు ఈ కాలంలో ఆర్థికంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల్లో లాభాలు పొందుతారు. బుద్ధి, ప్రణాళికతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం.

Lucky Zodiac Signs: వృషభ రాశిలోకి బుధుడు.. ఈ రాశులకు అదృష్టం తలుపు తట్టబోతోంది..!
Mercury Transit 2025

Edited By: Janardhan Veluru

Updated on: May 24, 2025 | 1:44 PM

Budh Gochar 2025: కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడానికి మే 24 నుంచి బుధుడు దారి చూపించబోతున్నాడు. బుద్ధి కారకుడైన బుధుడు వృషభ రాశిలో మే 24 నుంచి జూన్ 6 వరకు జూన్ 14 వరకూ ఈ రాశిలో కొనసాగడం జరుగుతుంది. ఈ సమయం మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. కొద్దిపాటి ప్రయత్నం, ప్రణాళిక, బుద్ధి చాతుర్యం అవసరం. వీటిని వృషభ రాశిలోని బుధుడు పుష్కలంగా ఇవ్వడం జరుగుతుంది. రెండు వారాల పాటు ఈ బుధ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఆదాయం దినదినాభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. రాజీమార్గంలో ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఈ రాశివారి ఆలోచనా విధానంలో బాగా మార్పు వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా లాభాలనిస్తాయి. మాటకు విలువ బాగా పెరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడు, ధన స్థానాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయానికే కాక ఆరోగ్యానికి కూడా లోటుండదు. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బును గట్టి పట్టుదలతో వసూలు చేసుకుంటారు. ఆస్తి వివాదాలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంపాదన మెరుగైన స్థితిలో ఉంటుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధుడు ప్రవేశించడం అనేది ఆర్థిక, ఆస్తి, కోర్టు సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లాభదాయక ఒప్పందాలు కుదర్చుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా, వేతనాలు పెరుగుతాయి.
  4. కన్య: రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో ప్రవేశించడం అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరగడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అపారంగా లాభించే అవకాశం ఉంది. ప్రతి ఆర్థిక ప్రయత్నమూ కలిసి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. విదేశీ సొమ్మును అను భవించే యోగం కూడా కలుగుతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఆస్తి విలువ బాగాపెరుగుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధమైన జీవితం అలవడుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి, మదుపులు చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి ఆర్థికంగా బాగా లబ్ధి పొందుతారు. షేర్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తి కలిసి రావడం జరుగుతాయి.
  6. మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల ఆదాయ వృద్ధికి సంబంధించి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలతో పాటు అదనపు సంపాదన కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా పురోగతి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. పొదుపు మార్గాలను అనుసరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు ఆశించిన లాభాలనిస్తాయి.