Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి కొత్త సవాళ్లు జాగ్రత్త..!

ఏప్రిల్ 3 నుంచి మే 11 వరకు కుజుడు మీన రాశిలో సంచారం చేయడంతో మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ, ఉద్యోగ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో స్కంద స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి కొత్త సవాళ్లు జాగ్రత్త..!
Kuja Challenges

Edited By:

Updated on: Mar 25, 2026 | 7:36 PM

ఏప్రిల్ 3 నుంచి మే 11వ తేదీ వరకు కుజుడు తనకు మిత్ర క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ సంచారంలో కుజుడు దుస్థానాల్లో ఉన్న రాశులు కొద్దిపాటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి కుజుడి మీన రాశి సంచారం కొన్ని కష్టనష్టాలు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ, వైవాహిక సమస్యలతో పాటు ఉద్యోగంలో ప్రాభవం తగ్గడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు తరచూ స్కంద స్తోత్రం పఠించడం మంచిది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు వ్యయ స్థానమైన మీన రాశిలో సంచారం చేయడం వల్ల అనారోగ్యానికి గురి కావడం, ప్రమాదాలు జరగడం, విద్యుదాఘాతం గానీ, అగ్ని ప్రమాదం గానీ సంభవించడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇదివరకటి ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది.
  2. సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల దంపతుల మధ్య విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. విద్యుత్తు, అగ్ని ప్రమాదాలు, చోర భయం కలుగుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేసి ఇబ్బంది పడతారు. ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి అత్యంత పాపి అయిన కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం తప్పకుండా కొన్ని అవయోగాలను కలిగిస్తుంది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో పొరపాట్లు జరిగి, టెన్షన్లు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యసనాలకు బాగా అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గి, టెన్షన్లు, వాగ్వాదాలు పెరుగుతాయి. మనశ్శాంతి తగ్గుతుంది. బాగా సన్నిహితులు ఆర్థికంగా మోసం చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యసనాలకు అలవాటుపడే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కలుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉండదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో ఒత్తిడి పెరుగుతుంది.
  5. కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల అకారణ కలహాలకు బాగా అవకాశం ఉంటుంది. కొందరు ముఖ్యమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఆదాయం తగ్గి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పెరుగుతాయి. అధికారులు, సహోద్యోగులు మిమ్మల్ని అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మాటకు విలువ తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వాహన, విద్యుత్, అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంది.
Follow Us