Money Astrology: కుజ చంద్రుల రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు..!

Mars - Moon Rashi Parivartan Yoga: ఏప్రిల్ 27, 28 తేదీల్లో కుజ, చంద్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది. ఈ రాశి పరివర్తన యోగం మేషం, కర్కాటకం, తుల సహా మరికొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ ప్రగతి, ఆస్తి లాభాలు తెస్తుంది. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఈ పరివర్తన ప్రభావం నెల రోజుల పాటు ఉంటుంది. ఈ నెల రోజుల్లో మంచి ఆదాయ, అధికార యోగాలు కలిగే అవకాశం ఉంది.

Money Astrology: కుజ చంద్రుల రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు..!
Rasi Parivartan Yoga

Edited By:

Updated on: Apr 26, 2025 | 12:10 PM

Telugu Astrology: ఈ నెల (ఏప్రిల్) 27, 28 తేదీల్లో కుజ, చంద్ర గ్రహాల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది. కుజుడికి సంబంధించిన మేష రాశిలో చంద్రుడు, చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో కుజుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన కలిగింది. ఈ యోగం పట్టిన రాశులకు ఆదాయం, హోదా, స్థితిగతులు పెరగడం, భూ లాభాలు, ఆస్తి లాభాలు కలగడం జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో తీసుకునే ఆదాయ, ఆర్థిక, ఆస్తి సంబంధమైన నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. కుజ, చంద్రుల పరివర్తన జరిగేది రెండు రోజులే అయినప్పటికీ దీని ప్రభావం నెల రోజులకు పైగా ఉంటుంది. ఈ పరివర్తన వల్ల మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు మంచి ఆదాయ, అధికార యోగాలు కలిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడితో చంద్రుడు పరివర్తన చెందడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది, రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా చేతికి అందుతాయి. ఉద్యోగంలో అంచనాలకు మించిన వృద్ధి, పురోగతి అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు పొందు తారు. ఆస్తి వివాదం పరిష్కారమై భూ లాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి.
  2. కర్కాటకం: ఈ రాశిలో ఉన్న కుజుడికి దశమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడితో పరివర్తన జరిగినందు వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, భూ లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది.
  3. తుల: ఈ రాశివారికి ధన, దశమాధిపతులైన కుజ, చంద్రుల మధ్య పరివర్తన జరిగినందువల్ల కెరీర్ పరంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల రీత్యా తరచూ ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తుంది.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి భాగ్యాధిపతితో పరివర్తన జరిగినందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ప్రయ త్నాలు బాగా కలిసి వస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
  5. మకరం: ఈ రాశికి చతుర్థ, సప్తమాధిపతులైన కుజ, చంద్రుల మధ్య పరివర్తన చోటు చేసుకున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభించడానికి అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశికి ధన, పంచమాధిపతులైన కుజ, చంద్రుల మధ్య పరివర్తన జరిగినందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు కనక వర్షం కురిపిస్తాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఊహించని ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కు తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. పిల్లలు బాగా పురోగతి చెందుతారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు.