Maha Parivartan Yoga: గురు, చంద్రుల యుతి.. ఆ రాశుల వారికి ఇక ధన యోగాలు, రాజయోగాలు!

Guru Chandra Yuti: నవంబర్ 2-4 తేదీల్లో గురు, చంద్రుల మధ్య అరుదైన మహా పరివర్తన యోగం ఏర్పడుతుంది. ఈ విశిష్ట యోగం వెయ్యి అదృష్టాలతో సమానం. కర్కాటక, మీన రాశులలో గ్రహ సంచారం వల్ల ఏర్పడే ఈ యోగం వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి అపారమైన శుభ ఫలితాలను, అదృష్టాన్ని అందిస్తుంది. చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.

Maha Parivartan Yoga: గురు, చంద్రుల యుతి.. ఆ రాశుల వారికి ఇక ధన యోగాలు, రాజయోగాలు!
Parivartan Yoga

Edited By:

Updated on: Oct 29, 2025 | 7:07 PM

Telugu Astrology: గురు, చంద్రుల మధ్య ఎటువంటి యుతి, సంబంధం ఏర్పడినా అది ఒక మహాయోగమని, ఇటు వంటి యోగాలు వెయ్యి అదృష్టాలతో సమానమని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. నవంబర్ 2, 3, 4 తేదీల్లో గ్రహ సంచారంలో గురు, చంద్రుల మధ్య అటువంటి అరుదైన, విశిష్టమైన యోగం ఒకటి చోటు చేసుకుంటోంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు, గురువుకు చెందిన మీన రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడికి మధ్య పరివర్తన యోగం కలుగుతోంది. ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు తప్పకుండా ఉత్తమ ఫలితాలనిస్తాయి. ఈ మహా పరివర్తన యోగం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారి దశ బ్రహ్మాండంగా తిరుగుతుందనడంలో సందేహం లేదు.

  1. వృషభం: తృతీయ స్థానంలో ఉచ్ఛలో ఉన్న గురువుకు, లాభ స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు సంపన్నులు కావడం, ఉన్నత పదవులు అలంకరించడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.
  2. మిథునం: ధన స్థానంలో ఉన్న ఉచ్ఛ గురువుకు, దశమ స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. కుటుంబంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, లాభసాటిగా సాగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం కూడా ఉంది.
  3. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి, భాగ్యాధిపతి గురువుకు మధ్య పరివర్తన జరగడం వల్ల కలలో కూడా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు అన్ని విధాలా స్థిరపడతారు. ఆస్తి వివాదం పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి.
  4. కన్య: ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం తప్పకుండా జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి అన్యోన్యత, సామరస్యం వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక విదేశీ అవకాశాలు లభిస్తాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది. సమర్థత, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  6. మీనం: రాశ్యధిపతి గురువుకు, పంచమాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి.