Lunar Eclipse-2025: ఈ రాశుల వారికి చంద్ర గ్రహణ కాలం శుభప్రదం.. ఆస్థి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం

ఈ ఏడాది 2025 రెండవ, చివరి చంద్ర గ్రహణం సెప్టెంబర్ లో ఏర్పడనుంది. ఈ సారి చంద్ర గ్రహణం మన దేశంలో కనిపించనుంది. అంతేకాదు కుంభరాశిలో చంద్రుడు ఉన్న సమయంలో చంద్ర గ్రహణం ఏర్పడనున్న నేపధ్యంలో కొన్ని రాశులకు కష్టాలను, కొన్ని రాశులకు శుభాలను కలిగిస్తుంది. ఈసారి చంద్రగ్రహణం మేషం, మిథున రాశి సహా మొత్తం 5 రాశులకు చాలా శుభప్రదం. ఈ రాశుల వ్యక్తులు ఆకస్మిక ధన లాభాలు, ఆస్తి, వాహన కొనుగోలు లేదా కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది.

Lunar Eclipse-2025:  ఈ రాశుల వారికి చంద్ర గ్రహణ కాలం శుభప్రదం.. ఆస్థి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం
న్యాయానికి అధిపతి అయిన శనీశ్వరుడు కుంభ రాశి అధిపతి. ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం శనీశ్వరుడి రాశి అయినా కుంభ రాశిలో ఏర్పడనుంది. శనీశ్వరుడు ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. అందుకే ఆయనను కర్మ దేవుడిగా భావిస్తారు. ఈ రోజున శనీశ్వరుడు అనేక రాశుల వారిపై తన ఆశీస్సులను కురిపించనున్నాడు.

Updated on: Aug 24, 2025 | 11:39 AM

2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడనుంది. ఇది జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలోని పూర్వాభాద్రపద నక్షత్రంలో జరుగుతుంది. ఇక్కడ చంద్రుడు, రాహువు కలయిక ఏర్పడనుంది. అదే సమయంలో సూర్యుడు, కేతువు ఏడవ ఇంట్లో ఉండటం ద్వారా చంద్రుడిని ప్రభావితం చేస్తారు. ఈ సమయంలో గ్రహాల ఈ ప్రత్యేక స్థానం కొన్ని రాశులకు గొప్ప అవకాశాలు కలగానున్నాయి. చంద్రగ్రహణం వలన కొన్ని రాశులకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.

ఈసారి చంద్రగ్రహణం 5 రాశులకు చాలా శుభాలను కలిగిస్తుంది. వీరికి ఆకస్మిక ధన లాభం, కెరీర్‌లో గొప్ప విజయం లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కోణంలో చంద్రగ్రహణ సమయం చాలా సున్నితంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం దేశం, ప్రపంచంపై కూడా కనిపిస్తుంది. అయితే గురువు శుభ దృష్టి చంద్రునిపై పడుతోంది. దీని కారణంగా ప్రతికూలత పరిమితం అవుతుంది. త్వరలో పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ఈ గ్రహణం తర్వాత అదృష్టం ప్రకాశించే 5 రాశుల వారు ఎవరో తెలుసుకుందాం..

మేషరాశి: సెప్టెంబర్ 7న జరిగే చంద్రగ్రహణం మేష రాశి వారికి శుభాలను తెస్తుంది. ఈ గ్రహణం ఈ రాశిలో 11వ ఇంట్లో జరుగుతోంది. దీనిని లాభ నిలయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో వీరు ఊహించని ఆర్థిక ప్రయోజనం పొందనున్నారు. వ్యాపారస్తులు సృజనాత్మక ఆలోచనలతో ప్రణాళికలను అమలులోకి తీసుకురావాల్సిన సమయం ఇది. అలాగే కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న సభ్యుడి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: మిథున రాశి వారికి, చంద్రగ్రహణం 9వ ఇంట్లో ఏర్పడనుంది. ఇది అదృష్టం , ద్రవ్య లాభాలతో ముడిపడి ఉంది. ఈ సమయం మీకు ఉపశమనం కలిగిస్తుంది ఎందుకంటే పాత డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కన్య రాశి: కన్యారాశి ఆరవ ఇంట్లో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది శత్రువులు, వ్యాధులతో ముడిపడి ఉన్న ఇల్లు. ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థులను అన్ని విధాలా ఓడిస్తారు. ఆఫీసులో కృషికి తగిన ప్రశంసలను అందుకుంటారు. వీరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పనిలో కొంచెం ఓపిక, అప్రమత్తతను కొనసాగించడం అవసరం.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి నాల్గవ ఇంట్లో ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఇల్లు, కుటుంబం, సౌకర్యాలకు సంబంధించిన ప్రభావాలను తెస్తుంది. ఈ సమయంలో వీరు వాహనం కొనాలనే కల తీరుతుంది. బైక్ కొనాలనుకునే కోరిక నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయనున్నారు. అయితే వీరు తమ తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.