Lucky Horoscope 2025: కీలక గ్రహాల అనుకూల సంచారం.. వారికి తిరుగులేని అదృష్ట యోగాలు..!

| Edited By: Janardhan Veluru

Dec 11, 2024 | 5:01 PM

Telugu Astrology 2025: శుక్ర, కుజుల అనుకూలమైన సంచారం కారణంగా వచ్చే ఏడాది మార్చి వరకూ కొన్ని రాశుల వారు విజయాలు అందుకోనున్నారు. వారికి అపజయాలు చవిచూసే అవకాశం ఉండదు. జనవరిలో కుంభ, మీన రాశుల్లో సంచారం చేయబోతున్న శుక్రుడు, మార్చి నెలాఖరు వరకు మిథున రాశిలో సంచారం చేయబోతున్న కుజుడి వల్ల కొన్ని రాశులకు తిరుగులేని అదృష్ట యోగాలు పట్టే అవకాశముంది.

Lucky Horoscope 2025: కీలక గ్రహాల అనుకూల సంచారం.. వారికి తిరుగులేని అదృష్ట యోగాలు..!
Lucky Horoscope 2025
Follow us on

Lucky Astrology 2025: శుక్ర, కుజుల అనుకూల సంచారం వల్ల వచ్చే ఏడాది మార్చి వరకూ కొన్ని రాశుల వారు విజయాలు, సాఫల్యాలను తప్ప అపజయాలను చవిచూసే అవకాశం లేదు. జనవరిలో కుంభ, మీన రాశుల్లో సంచారం చేయబోతున్న శుక్రుడు, మార్చి నెలాఖరు వరకు మిథున రాశిలో సంచారం చేయబోతున్న కుజుడి వల్ల కొన్ని రాశులకు తిరుగులేని అదృష్ట యోగాలు పట్టబోతున్నాయి. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులవారు ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి సాధించడంతో పాటు, దాదాపు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. వీరు ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది.

  1. వృషభం: కొత్త సంవత్సరం ఈ రాశి వారికి అత్యద్భుతంగా, అతి వైభవంగా ప్రారంభం కాబోతోంది. రాశి నాథుడు శుక్రుడు ఉచ్ఛపట్టడం గొప్ప అదృష్టంగా భావించవచ్చు. ఆ రాశివారు కొద్ది ప్రయత్నంతో అనేక విషయాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక సాఫల్యాలు కలుగు తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొన్ని పెండింగ్ పనులు, శుభకార్యాలు పూర్తవుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
  2. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, కుజుడు అనుకూలంగా మారడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ప్రయ త్నాలు బాగా అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు సఫలమయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. లక్ష్మీకటాక్షాలు కలుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తయి ఆర్థికంగా లాభం పొందుతారు.
  3. తుల: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కుజ సంచారం, రాశినాథుడు శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల అను కున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి. జీత భత్యాలు కూడా అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చిన్న ప్రయత్నం చేపట్టినా అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. గృహ లాభం కలుగుతుంది.
  4. వృశ్చికం: రాశినాథుడు కుజుడి అనుకూల సంచారంతో పాటు, పంచమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా అనేక శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. అధికార యోగం పట్టడంతో పాటు జీతభత్యాలు, అదనపు ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఇతర కష్టనష్టాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి శుక్ర, కుజులిద్దరూ పూర్తి స్థాయిలో కనక వర్షం కురిపించే అవకాశం ఉంది. అనేక విధా లుగా సంపద పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో లాభాల పంట పండుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఇతరత్రా చేతికి అందవలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభ గ్రహమైన శుక్రుడు ఉచ్ఛపట్టడం, కుజుడు కూడా అనుకూలంగా మారడం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. కనీవినీ ఎరుగని రీతిలో సుఖ సంతోషాలను అనుభవిస్తారు. భోగభాగ్యాలు వృద్ధి చెందుతాయి. అనేక సమస్యలు, కష్టనష్టాల నుంచి బయటపడతారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టే పెట్టుబడుల వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది.