శరీరంపై పుట్టుమచ్చల రహస్యాలు..! ఈ చోట ఉంటే మీ లైఫ్ సూపర్‌గా ఉంటుందట..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన శరీరంపై పుట్టు మచ్చలు వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని పుట్టు మచ్చలు ధన, భవిష్యత్తు, ప్రేమ, కెరీర్‌పై ప్రభావం చూపుతాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మీ శరీరంపై ఉన్న పుట్టు మచ్చల అర్థం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శరీరంపై పుట్టుమచ్చలు మన వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని, జీవితంలోని అనేక సంఘటనలను ప్రభావితం చేస్తాయని చెబుతారు. పుట్టుమచ్చల సంఖ్య, అవి ఉండే స్థానం వ్యక్తిగత జీవితాన్ని నిర్ణయించగలవని నమ్మకం ఉంది. శరీరంపై ఉన్న పుట్టుమచ్చలకు ప్రత్యేక అర్థం ఉంటుంది. పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో, అవి ఎంత పెద్దగా ఉన్నాయో, ఏ రంగులో ఉన్నాయో అనుసరించి భిన్నమైన ఫలితాలు ఇస్తాయి. ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే అది శుభసూచకమో ఇప్పుడు తెలుసుకుందాం.
నుదుటి కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్ట సూచికంగా భావిస్తారు. ఇది ధన, గౌరవం, సామాజిక ప్రాధాన్యతను సూచిస్తుంది. అయితే ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే అది కొన్ని ఆర్థిక సమస్యలు, కెరీర్‌లో ఆటంకాలను సూచించవచ్చు.
కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే విజయం, గొప్ప భవిష్యత్తును సూచిస్తుంది. కానీ ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే కెరీర్, బిజినెస్‌లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది.
కుడి కంటికి దగ్గరగా పుట్టుమచ్చ ఉంటే ధనం, సంతోషాన్ని సూచిస్తుంది. కానీ ఎడమ కంటికి దగ్గరగా ఉంటే ఎక్కువ ఆర్థిక ఒత్తిడిని సూచించవచ్చు.
ముక్కు చివర పుట్టుమచ్చ ఉంటే సామాజిక జీవితం గందరగోళంగా ఉండొచ్చు. పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే దయ, ప్రేమాభిమానాన్ని సూచిస్తుంది. అయితే కిందటి పెదవిపై పుట్టుమచ్చ ఉంటే కళల పట్ల ఆసక్తి, సృజనాత్మకతను సూచిస్తుంది.
చెంపలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టంగా భావిస్తారు. వీరు సమాజంలో మంచి గౌరవం, స్థిరమైన జీవితాన్ని పొందే అవకాశముంది.
కుడి చెవిపై పుట్టుమచ్చ ఉంటే సులభంగా ధనం సమకూరే అవకాశం ఉంటుంది. కానీ ఎడమ చెవిపై పుట్టుమచ్చ ఉంటే కష్టపడి ఎదగాల్సిన పరిస్థితులు ఉంటాయి.
మెడ ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధనం, గౌరవం సమకూరుతాయని చెబుతారు. అయితే భుజాలపై పుట్టుమచ్చ ఉంటే వీరు శ్రమజీవులు అని.. ఎంత కష్టమైనా నెగ్గుకుంటారని అర్థం.
ఛాతి కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఇది గొప్ప అదృష్ట సూచికం. కానీ ఎడమ భాగంలో ఉంటే ఆర్థిక ఒత్తిడిని సూచించవచ్చు. పొత్తికడుపు దగ్గర పుట్టుమచ్చ ఉంటే సంపద, సంతోషాన్ని సూచిస్తుంది.
వెనుక భాగంలో పుట్టుమచ్చ ఉంటే సంపద లభించవచ్చు.. కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి.
కుడి చేతిలో పుట్టుమచ్చ ఉంటే ధనవంతులవుతారని.. ఎడమ చేతిలో ఉంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం.
కాళ్లపై పుట్టుమచ్చలు ఉంటే ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశముంది. అయితే వేళ్లపై పుట్టుమచ్చలు ఉంటే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చని చెబుతారు.
తొడలపై పుట్టుమచ్చ ఉంటే సుఖమైన జీవితం ఉంటుందని.. మోకాళ్లపై పుట్టుమచ్చ ఉంటే సహాయస్వభావం, దయగల వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని అంటారు.