
Love Astrology in Telugu
Zodiac Signs: కొన్ని రాశులవారు ప్రేమిస్తే ఒకరికొకరు అన్నట్టుగా ప్రేమిస్తారు. జన్మజన్మల బంధం అన్నట్టుగా వ్యవహరిస్తారు. అయితే, కొన్ని రాశులవారు ప్రేమిస్తే అవతలివారు ఎందుకు ప్రేమించాం ఈ వ్యక్తిని అన్నట్టుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎలా వ్యవహరించాలో, ఎలా ఆకట్టుకోవాలో తెలియని రాశులు అయిదు ఉన్నాయి. అవిః మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీనం. మిగిలిన ఏడు రాశుల వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ, ఈ అయిదు రాశుల వారితో ప్రేమలో పడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఇద్దరూ ఒకే రాశి అయ్యే పక్షంలో తప్పకుండా సమస్య పెరుగుతుంది. ఈ అయిదు రాశుల మనస్తత్వాలను ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఇవి ప్రేమ వ్యవహారాలకు మాత్రమే వర్తిస్తాయి. జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులను బట్టి కొన్ని లక్షణాలు మారే అవకాశం ఉంటుంది.
- మేషం: ఈ రాశివారిలో తనకు మాత్రమే పరిమితం కావాలన్న, తమకు మాత్రమే చెందాలన్న మనస్తత్వం (పొసెసివ్నెస్) బాగా ఉంటుంది. ప్రేమ వ్యవహారమన్నది ఈ రాశివారికి ఒక విజయంగా, సామాజిక హోదాగా కనిపిస్తుంది. ఈ రాశివారిలో అహంకారం, కోపం కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలియదు. సున్నితంగా వ్యవహరించాల్సిన విషయాల్లో మొర టుగా వ్యవహరిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఈ రకమైన మనస్తత్వం ఇబ్బంది కలిగిస్తుంటుంది.
- కర్కాటకం: ఈ రాశివారిలో భావోద్వేగాలు ఎక్కువ. ప్రేమకు సంబంధించిన అంశాల్లో చిన్న చిన్న విషయాలకు సైతం ఎంతగానో మనస్తాపం చెందుతుంటారు. అకస్మాత్తుగా ఆత్మ న్యూనతా భావం ఆవరిస్తుంటుంది. అనవసరంగా అసూయపడు తుంటారు. సుఖ సంతోషాల కంటే బాధలను ఎక్కువగా మనసులో పెట్టుకుంటారు. ఇంకొకరికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతుంటారు. వీరిని తరచూ శాంతింపజేస్తుండడం, బుజ్జగిస్తూ ఉండడం చేయాలి. ప్రేమ వ్యవహారాల్లో అంతగా ఇమడ లేరు.
- కన్య: ప్రేమ వ్యవహారం ఒక పద్ధతిగా ఉండాలని, పర్ఫెక్ట్ గా ఉండాలని వీరు భావిస్తారు. ప్రేమకు కూడా నియమ నిబంధనలు ఉంటాయని, వాటికి కట్టుబడి ఉండాలని భావిస్తుంటారు. సాధారణంగా ఈ మనస్తత్వం ఈ ఆధునిక కాలంలో ఎవరికీ సరిపోదు. ఈ రాశివారు ఏది నియమం అనుకుంటే దాన్ని అవతలి వారు పాటించాల్సి ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు అవకాశం ఇవ్వరు. సమయ పాలన, క్రమశిక్షణ గురించి పట్టుబడుతుంటారు. దీనివల్ల ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
- వృశ్చికం: ఈ రాశివారిలో అసహనం ఎక్కువ. వీరికి అనుకూలంగా వ్యవహరించినంత వరకూ ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొద్దిగా తేడా వచ్చినా కోపతాపాలు పెరిగిపోతాయి. ఈ రాశి వారిలో కూడా అవతలి వ్యక్తి తమకు మాత్రమే చెందాలన్న భావన ఉంటుంది. ఈ రాశివారిలో అసూయ కూడా ఎక్కువగానే వ్యక్తం అవుతుంటుంది. అనుమానాలు పెంచుకుంటారు. ఒక్కోసారి మాటలతో బాధపెట్టడం కూడా జరుగుతుంటుంది. వీరు ప్రేమలో పడే అవకాశం బాగా తక్కువ.
- మీనం: అతి సున్నిత మనస్తత్వం కలిగిన మీన రాశివారు ప్రేమ వ్యవహారాల్లో అంత త్వరగా ఇమిడి పోలేరు. ప్రేమ వ్యవహారాల్లో శృంగార రసం కంటే కరుణ రసం, విషాద రసాలను ఎక్కువగా ఒలక బోస్తుంటారు. ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతుంటారు. పార్కులకు వెళ్లాల్సిన వారు ఆల యాల వైపు వెడుతుంటారు. ఒక పట్టాన నిర్ణయం తీసుకోరు. బాగా ఆలోచిస్తారు. వీరితో వ్యవహరించడం అవతలివారికి కష్టమవుతుంటుంది. అయితే, వీరిలో చిత్తశుద్ధికి, నిజాయతీకి లోటు ఉండదు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.