Lord Shanishwara: శనీశ్వరుడిని ఇంట్లో ఎందుకు పూజించరు.. చరణాలను మాత్రమే ఎందుకు దర్శించుకుంటారంటే..

|

Jan 27, 2024 | 7:21 AM

హిందూ మతంలో చాలా మంది దేవుళ్ళు, దేవతలను పూజిస్తారు.  అంతేకాదు ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా దేవుళ్ల పటాలను, విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. ఇంట్లో దేవుళ్ళు, దేవతల చిత్రాలు లేదా విగ్రహాలను ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.  అయితే శనీశ్వరుడు కూడా హిందువులు పూజించే దేవుడు అయినా సరే.. ఇంట్లో పటం లేదా విగ్రహం ఉంచి పూజించడం నిషేధంగా భావిస్తారు.   

Lord Shanishwara: శనీశ్వరుడిని ఇంట్లో ఎందుకు పూజించరు.. చరణాలను మాత్రమే ఎందుకు దర్శించుకుంటారంటే..
Lord Shanishwara Puja
Follow us on

హిందూ మతపరమైన కథల ప్రకారం శనిశ్వరుడిని న్యాయ దేవుడుగా భావిస్తారు. శనివారం శనీశ్వరుడికి అంకితం చేశారు. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే ఆశీర్వాదం లభిస్తుందని.. అదృష్టం తలపుతడుతుంది. మరోవైపు శనీశ్వరుడు చెడు దృష్టి పడిన వ్యక్తి జీవితంలో  దుఃఖం, సమస్యలతో నిండిపోతుందని విశ్వాసం. కనుక శనీశ్వరుడి ఆశీర్వాదం పొందడానికి ప్రజలు శనీశ్వరుడి దేవాలయానికి వెళ్లి శనిదేవుని పూజిస్తారు.

హిందూ మతంలో చాలా మంది దేవుళ్ళు, దేవతలను పూజిస్తారు.  అంతేకాదు ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా దేవుళ్ల పటాలను, విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. ఇంట్లో దేవుళ్ళు, దేవతల చిత్రాలు లేదా విగ్రహాలను ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.  అయితే శనీశ్వరుడు కూడా హిందువులు పూజించే దేవుడు అయినా సరే.. ఇంట్లో పటం లేదా విగ్రహం ఉంచి పూజించడం నిషేధంగా భావిస్తారు.

మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో శనీశ్వరుడి విగ్రహం లేదా పటం ఉంచడం అశుభం. శనీశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకపోవడం వెనుక ఒక పురాణ కథ ఉంది. దాని ప్రకారం శనిదేవుని దృష్టి ఎవరిపై పడుతుందో వారికి అశుభాలు జరుగుతాయనే శాపం ఉందట.

ఇవి కూడా చదవండి

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం శనిశ్వరుడు  కృష్ణ లేదా విష్ణువుకి గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతని భక్తిలో మునిగి ఉండేవాడు. ఒకసారి శనిదేవుని భార్య అతనిని కలవడానికి వచ్చింది.  ఆ సమయంలో కూడా శనీశ్వరుడు  శ్రీ కృష్ణుని ధ్యానం నుంచి బయటకు రాలేదు. భక్తిలో మునిగిపోయాడు. శనీశ్వరుని భార్య ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని ఏకాగ్రత విచ్ఛిన్నం కాలేదు.

దీంతో అతని భార్య కోపోద్రిక్తుడై ఈరోజు నుంచి శనిదేవుని దర్శిస్తే అరిష్టం తప్పదని శనిదేవుడిని శపించింది. తరువాత శనిదేవుడు తన తప్పును గ్రహించి తన భార్యకు క్షమాపణ చెప్పాడు. అయితే అతని భార్యకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి లేదు. ఈ కారణంగా అప్పటి నుండి శనీశ్వరుడు తన చూపు ఎవరిపై పడకుండా.. ఎవరికీ ఎటువంటి దురదృష్టం కలుగకుండా తల వంచుకుని నడుస్తాడు.

శని దేవుడి చెడుద్రుష్టి కారణంగా అతని చిత్రం లేదా విగ్రహం ఇంట్లో పెట్టుకోరు. తద్వారా శనిదేవుడు దృష్టికి దూరంగా ఉంటారు. అందుకనే శనీశ్వరుడి చాలా దేవాలయాలలో అతని ప్రతిమను పూజించే బదులు, అతని చెడ్డ ద్రుష్టి ఎవరిపైనా పడకుండా ఉండేలా శిలను పూజిస్తారు. ఈ కారణంగా శని దేవుడి విగ్రహం కళ్లలోకి చూడకూడదని..  శని దేవుడి చరణాలను మాత్రమే దర్శించుకోవాలని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు