December Horoscope: ఏలిన్నాటి శనితో వీరికి నెలంతా బ్యాడ్‌టైమ్.. డిసెంబర్‌ నెలలో 12 రాశిఫలాలు ఇలా..

ఏలిన్నాటి శనితో పాటు, ఈ రాశిలో రాహు సంచారం వల్ల పనిభారం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా గుర్తింపు లభించని పరిస్థితి ఉంటుంది. శ్రమ ఎక్కువ  ఫలితం తక్కువగా కూడా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. మిమ్మల్ని అతిగా ఉపయోగించుకునే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

December Horoscope: ఏలిన్నాటి శనితో వీరికి నెలంతా బ్యాడ్‌టైమ్.. డిసెంబర్‌ నెలలో 12 రాశిఫలాలు ఇలా..

Edited By: Ravi Kiran

Updated on: Dec 01, 2025 | 8:10 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ నెల 7వ తేదీ నుంచి రాశ్యధిపతి కుజుడు భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల మీద ఎంత శ్రద్ద పెంచితే అంత మంచిది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం ప్రారంభి స్తాయి. ధన స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.  వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ సమాచారం అందుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమ స్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో ఆఫర్లు అందుకుంటారు. విద్యా ర్థులు తేలికగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు సప్తమ రాశిలో, శని లాభ స్థానంలో, గురువు ధన స్థానంలో సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఈ నెలంతా ఆదాయం ఏదో విధంగా వృద్ధి చెందు తూనే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు, మీ ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు మీ అవసరం బాగా పెరుగు తుంది. వృత్తి జీవితంలో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. బంధుమిత్రులకు బాగా సహాయకారిగా ఉంటారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యో గుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపడి ఎవరినీ నమ్మడం మంచిది కాదు. విద్యార్థులు చదువుల్లో బాగా కష్ట పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఈ రాశిలో గురువు, పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల కొన్ని శుభ పరిణా మాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొన్ని కష్టనష్టాల నుంచి గట్టెక్కడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమై మానసికంగా ఊరట లభిస్తుంది. శుక్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల జీవిత భాగస్వామి తోనూ, పిల్లలతోనూ సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో  ప్రతిభా పాట వాలు, శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సా హం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. శుభ వార్త వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపో తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, రవి, బుధ గ్రహాలతో పాటు శనీశ్వరుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా సాగిపోతాయి. జీవితాన్ని మలుపు తిప్పగల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజయోగాలు, ధన యోగాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో పని భారం, బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరి ష్కరించుకుంటారు. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటప డుతుంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు నిలకడగా సాగిపో తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

డిసెంబర్ 5 తర్వాత గురువు లాభ స్థానంలోకి మారడం, రాశ్యధిపతి రవి కూడా అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని ప్రధాన సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. బుధ, శుక్రుల అనుకూలత వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు, ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దా నాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో, గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల  వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధన స్థానంలో బుధుడి సంచారం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. పెద్దల సలహాలతో వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని కొంత మేరకు పరిష్క రించుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. కొందరు బంధువుల వల్లఇబ్బంది పడతారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశిలో బుధుడు, ధన స్థానంలో రవి, శుక్రులు, భాగ్యంలో గురువు, ఆరవ స్థానంలో  శనీశ్వ రుడి సంచారం బాగా అనుకూలంగా ఉంది. నెలంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగం లోనూ, కుటుంబంలోనూ కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆదాయం పెరుగు తుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. బంధుమి త్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఈ రాశిలో ఈ నెలంతా మూడు నాలుగు గ్రహాల సంచారం  వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా వ్యక్తిగతం కూడా కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలిచి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఏ పనైనా కొద్ది శ్రమతో పూర్తవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు.ఆర్థిక ప్రయత్నాల వల్ల బాగా లాభముంటుంది. ఉద్యోగంలో యాక్టివిటీ పెరుగు తుంది. అధికారులు బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా కొన సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు పెద్దల జోక్యంతో పరిష్కారం అవు తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు డిసెంబర్ 5 నుంచి సప్తమ స్థానంలో మారడంతో పాటు, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి, గౌరవ మర్యాద లకు లోటుండదు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలను ఇస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. కొందరు మిత్రులకు ఆర్థిక సాయం చేస్తారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపో తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

తృతీయంలో శని, లాభ స్థానంలో మూడు గ్రహాల సంచారం వల్ల ఈ నెలంతా ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. దాదాపు ప్రతి పనిలోనూ, ప్రతి  విషయంలోనూ పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. ఉద్యోగం మారాలన్న ఆలోచన ఫలించకపోవచ్చు. ప్రతికూలతలు బాగా తగ్గిపోతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఆదా అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యవంతం అవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనేక మార్గాలలో ఆదాయాన్ని పెంచు కునే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. దూరపు బంధువుల్లో ఆశిం చిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలిన్నాటి శనితో పాటు, ఈ రాశిలో రాహు సంచారం వల్ల పనిభారం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా గుర్తింపు లభించని పరిస్థితి ఉంటుంది. శ్రమ ఎక్కువ  ఫలితం తక్కువగా కూడా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. మిమ్మల్ని అతిగా ఉపయోగించుకునే వారుంటారు. ఉద్యోగంలో అధికారుల వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి సమయం అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులతో పాటు అనారోగ్యాలు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడిపరంగా ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆహార విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం అవసరం. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

గురు, బుధ, రవి, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కూడా అంచనాలకు తగ్గ లాభాలు గడించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి, వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక, వ్యక్తి గత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థికపరంగా ఇబ్బందులుంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి పట్టుదలగా ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. ఆరోగ్యానికి, ఆదాయా నికి లోటుండదు. బంధువుల నుంచి, పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు కాస్త నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. విద్యార్థులు ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం.