Lord Shani Dev
శనితో గురు, శుక్ర, బుధులలో ఎవరైనా కలిసినా, వీరి దృష్టి శని మీద పడినా శని ప్రభావం, శని దోషం చాలావరకు తగ్గిపోతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం కుంభ రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడిని సప్తమ స్థానం నుంచి, అంటే సింహ రాశి నుంచి బుధుడు వీక్షిస్తున్నందు వల్ల శని యోగప్రదుడుగా మారడం జరుగుతుంది. ప్రస్తుతం శని దోషం బాగా తగ్గడం వల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి అనేక కీలక విషయాల్లో విజయాలు సంప్రాప్తించి, జీవితం మంచి మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఈ యోగ కాలం ఆగస్టు 22 వరకూ కొనసాగుతుంది.
- వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాఫారాల్లో పని భారం, ఒత్తిడి బాగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఏ రంగంలో ఉన్నవారికైనా ప్రతిఫలం లేని బాధ్యతలు మీద పడడం, మోయలేని భారాన్నిమోయవలసి రావడం, జీతభత్యాల్లో ఎదుగూ బొదుగూ లేకపోవడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం ఈ శని మీద బుధుడి దృష్టి పడినందువల్ల పనిభారం చాలా వరకు తగ్గడం, జీతభత్యాలు పెరగడం, శ్రమకు గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శని సంచారం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. విదేశాల నుంచి అందాల్సిన ఆఫర్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదో న్నతి కష్టమవుతుంది. అయితే, ఈ రాశ్యధిపతి బుధుడు శనిని వీక్షిస్తున్నందువల్ల ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. పదోన్నతులతో పాటు జీతభత్యాల పెరుగుదలకు కూడా అవకాశం ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు.
- కన్య: సాధారణంగా ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది కానీ, పురోగతి ఆగిపోతుంది. ఆర్థికంగా కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాశ్యధిపతి బుధుడి దృష్టి శని మీద పడినందువల్ల ఈ పరి స్థితిలో మార్పు వస్తుంది. శని ప్రభావం గణనీయంగా తగ్గినందువల్ల, ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో సైతం ఆశించిన పురోగతి ఉంటుంది. ఇతరత్రా ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది.
- తుల: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరగక పోవడం, ఫలితంగా ఆర్థిక పరిస్థితిలో పురోగతి లేకపోవడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా బాధిస్తాయి. ప్రస్తుతం లాభ స్థానం నుంచి బుధుడు శనీశ్వరుడిని వీక్షించడం వల్ల పరిస్థితులు మారి, కొద్ది ప్రయత్నంతోనే ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నెరవేరుతాయి. ముఖ్యంగా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శని మీద బుధుడి దృష్టి పడినందువల్ల ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు క్రమంగా నష్టాలు, సమస్యల నుంచి బయట పడతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడం వేగవంతం అవుతుంది. ఇంతవరకూ నత్తనడకగా ఉన్న పురోగతి క్రమంగా ఊపందుకుం టుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు పూర్తి స్థాయిలో సఫలం అవుతాయి.
- కుంభం: ఈ రాశిని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న, కష్టాలకు గురిచేస్తున్న ఏలిన్నాటి శని ప్రభావం బుధుడి దృష్టితో చాలావరకు తగ్గిపోతుంది. ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఉద్యో గంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఏర్పడడం, వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడడం వంటివి జరుగుతాయి. అనేక కీలక విషయాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నెరవేరే అవకాశం ఉంది.