Lord Shani Dev: కుంభరాశిలో శనీశ్వరుడితో రవి కలయిక.. ఆ రాశుల వారికి విశేష యోగాలు..!

| Edited By: Janardhan Veluru

Feb 14, 2024 | 6:17 PM

ఈ నెల 14 నుంచి కుంభరాశిలో రవి ప్రవేశించడం జరుగుతుంది. రవి కుంభరాశిలో దాదాపు నెల రోజులు ఉంటాడు. రవి ఈ రాశిలో ప్రవేశించిన కారణంగా, ఇదే రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడు అస్తంగత్వం పొందడం జరుగుతుంది. అస్తంగత్వం అంటే సూర్యుడి వేడిమికి శనీశ్వరుడు మాడిపోవడం. శని అస్తంగత్వం చెందినప్పటికీ, ఈ నెల రోజుల కాలంలో ఆరు రాశులు విశేషంగా యోగాలను అనుభవించడం జరుగుతుంది.

Lord Shani Dev: కుంభరాశిలో శనీశ్వరుడితో రవి కలయిక.. ఆ రాశుల వారికి విశేష యోగాలు..!
Lord Shani Dev
Follow us on

ఈ నెల 14(బుధవారం) నుంచి కుంభరాశిలో రవి ప్రవేశించడం జరుగుతుంది. రవి కుంభరాశిలో దాదాపు నెల రోజులు ఉంటాడు. రవి ఈ రాశిలో ప్రవేశించిన కారణంగా, ఇదే రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడు అస్తంగత్వం పొందడం జరుగుతుంది. అస్తంగత్వం అంటే సూర్యుడి వేడిమికి శనీశ్వరుడు మాడిపోవడం. శని అస్తంగత్వం చెందినప్పటికీ, ఈ నెల రోజుల కాలంలో ఆరు రాశులు విశేషంగా యోగాలను అనుభవించడం జరుగుతుంది. వీరికి అన్నివిధాలుగానూ గౌరవమర్యాదలు పెరగడంతో పాటు, హోదాపరంగా, ఆర్థికపరంగా గతం కంటే ఉన్నత స్థాయి లభించడానికి అవకాశం ఉంది. ఈ రాశుల వారు తప్పకుండా ఆర్థికంగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆ ఆరు రాశులుః మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు.

  1. మేషం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా ఇతర కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారులకు, డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి లాభాలు అంచనాలకు మించి పెరగడంతో పాటు, వారు విస్తరణను కూడా చేపట్టడం జరుగుతుంది. పనులు, వ్యవహారాలన్నిటినీ పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
  2. వృషభం: ఈ రాశికి దశమ కేంద్రంలో శని అస్తంగత్వం చెందడం వల్ల ఈ రాశివారికి రాజయోగం పట్టే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. తప్పకుండా అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి. అనుకోకుండా సంపద కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యో గులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారవచ్చు.
  3. మిథునం: చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విశేషంగా కలిసి వచ్చి, వ్యక్తిగత సంపద వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నవారికి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు వింటారు. మొత్తంమీదగతం కంటే జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది.
  4. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శని అస్తంగతుడవుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు తిరుగుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వస్తు, వాహనాలు సమకూరే అవకాశం కూడా ఉంది.
  5. తుల: ఈ రాశివారి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఇళ్లు, స్థలాలు లేదా కార్లు కొనే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు. వారసత్వ సంపద కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా రాబడి పెరుగు తుంది. ఉద్యోగులకు హోదాపరంగా, ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా వృద్ధి ఉంటుంది. వైవాహిక జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
  6. ధనుస్సు: ఈ రాశివారికి శని అస్తంగతుడు అవడం అనేది విపరీత రాజయోగం ఇస్తుంది. జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా చెలామణీ అవడం జరుగుతుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అయి, అతి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విదేశాల్లో సైతం గౌరవ మర్యాదలు పెరుగుతాయి.