Money Astrology
ఈ నెల 16 (శనివారం) నుంచి ఏప్రిల్ 23 వరకు కుజుడు కుంభ రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ రాశి కుజుడికి శత్రు క్షేత్రం. పైగా తనకు పరమ శత్రువైన శనీశ్వరుడితో కలిసి ఉండడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక సాధారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో తీవ్రస్థాయి కష్టనష్టాలను సృష్టిస్తుంది కానీ, ఈసారి మాత్రం ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలపరంగా, ఆర్థికంగా బాగా మేలు చేసే అవకాశం ఉంది. మేషం, వృషభం, కన్య, ధనుస్సు, మకరం, కుంభరాశుల వారికి ఈ రెండు పాప గ్రహాల కలయిక యోగం కలిగిస్తుంది. మిగిలిన రాశుల వారు ఈ కలయిక విష యంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్ర నామం, స్కంధ స్తోత్రం వంటివి పఠించడం వల్ల ఈ అశుభ కలయిక నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
- మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితో లాభాధిపతి శనీశ్వరుడికి యుతి ఏర్పడడం వల్ల అనేక విధాలైన ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగానికి అవకాశం ఉంది. పోలీస్, మిలిటరీ, డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అపర కుబేరులవుతారు. ఆశించిన శుభవార్తలు వింటారు.
- వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో ఈ పాప గ్రహ యుతి ఏర్పడినందువల్ల, వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలకమైన సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు బాగా బిజీ అయిపోతారు. వారి రాబడి కూడా విశేషంగా పెరుగుతుంది. వ్యాపారాల్లో పోటీదార్లు వెనక్కు తగ్గుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. రాబడికి లోటుండదు.
- కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కుజ, శనుల సంచారం విపరీత రాజయోగాన్నిస్తుంది. దీనివల్ల ఏప్రిల్ 23 వరకూ జీవితం అన్ని విధాలు గానూ రాజా లాగా గడిచిపోతుంది. గతంలో కంటే ఆదా యం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కూడా బాగా మెరుగ్గా ఉంటుంది. అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ఉద్యోగ యోగం ఉంటుంది. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో ఈ రెండు పాప గ్రహాల కలయిక వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆస్తిపాస్తులు కొనడం జరుగుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది.
- మకరం: ఈ రాశ్యధిపతి శనీశ్వరుడు ధన స్థానంలో ఉండడం, అక్కడ లాభాధిపతి కుజుడు కలవడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. భూ సంబంధమైన ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. సంపద పెరుగుతుంది. మాటకు, చేతకు విలువ ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం, రాబడి బాగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఏదో విధంగా ధనం సంపాదించాలనే తపన వృద్ధి చెందుతుంది.
- కుంభం: ఈ రాశినాధుడైన శనీశ్వరుడితో కుజుడి కలయిక వల్ల, కొన్ని కీలకమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమ స్యలను తగ్గించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాధాన్యం, ప్రాభవంతో పాటు రాబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.