Zodiac Signs: పాప గ్రహంతో వారికి శుభ యోగాలు.. ఆ రాశుల వారిని అదృష్టం పట్టనుంది..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు అత్యంత పాప గ్రహం. అయితే, ఏ పాప గ్రహమైనా గురువుకు చెందిన నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా శుభ యోగాలను, శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం శత్రు క్షేత్రమైన మిథున రాశిలో అక్టోబర్ 20వ తేదీ వరకు సంచారం చేస్తున్న కుజుడు తన మిత్రుడైన గురు గ్రహానికి చెందిన పునర్వసు నక్షత్రంలో సంచారం ప్రారంభించినందువల్ల..

Zodiac Signs: పాప గ్రహంతో వారికి శుభ యోగాలు.. ఆ రాశుల వారిని అదృష్టం పట్టనుంది..!
Telugu Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 23, 2024 | 6:45 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు అత్యంత పాప గ్రహం. అయితే, ఏ పాప గ్రహమైనా గురువుకు చెందిన నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా శుభ యోగాలను, శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం శత్రు క్షేత్రమైన మిథున రాశిలో అక్టోబర్ 20వ తేదీ వరకు సంచారం చేస్తున్న కుజుడు తన మిత్రుడైన గురు గ్రహానికి చెందిన పునర్వసు నక్షత్రంలో సంచారం ప్రారంభించినందువల్ల కొన్ని రాశులకు శుభఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం వల్ల అనేక రకాలైన అదృష్టాలు కలుగుతాయి. ఆదాయం బాగా పెరగడంతో పాటు అధికారం కూడా పడుతుంది. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ, ఉద్యోగ ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. ప్రయాణాలు పెరిగినా వాటి వల్ల లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు వ్యయంలో ఉన్నప్పటికీ కొన్ని శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. శుభ కార్యాల మీద వ్యయం ఎక్కువగా ఉంటుంది. వృథా ఖర్చులను బాగా తగ్గించుకుని, పొదుపు చేయడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. కుటుంబ సభ్యులు తమ తమ రంగాల్లో విజయాలు సాధి స్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి.
  3. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడు ఈ రాశికి శుభుడైన గురువుకు చెందిన పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా అభివృద్ది బాటలో పయనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరించడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో ముఖ్యమైన శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి ధన, పంచమాధిపతిగా శుభుడైన గురు నక్షత్రంలో రాశ్యధిపతి కుజుడు సంచారం చేయ డం అన్నివిధాలుగానూ శుభ ప్రదంగా, లాభదాయకంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. జీవిత భాగస్వామి తరఫు నుంచి కలిసి వస్తుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో పునర్వసు నక్షత్రంలో సంచారం ప్రారంభిస్తున్న కుజుడి వల్ల అనుకో కుండా, అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయం సాధి స్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు పెరుగు తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
  6. మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువు నక్షత్రంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. ఈ దిశగా ఏ ప్రయత్నం మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. ధనాదాయం బాగా పెరుగుతుంది. వాహన యోగం పడుతుంది. తల్లి వైపు నుంచి స్థిరాస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆస్తిపాస్తు లున్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం, కోర్టు కేసులు సానుకూలపడతాయి.