Kuja Gochar: కుజుడి బలంతో ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!

| Edited By: Janardhan Veluru

Jan 10, 2025 | 4:34 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధైర్యం, సాహసం, చొరవ, భూ లాభం, స్థిరాస్తులకు కుజుడు కారకుడు. ఈ నెలలో కొన్ని రాశుల వారికి కుజుడు బాగా అనుకూలంగా మారబోతున్నాడు. ఈ నెల(జనవరి) 21 తర్వాత కుజుడు మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఉగాది వరకూ కుజుడు ఇదే రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశులవారికి ధన యోగాలను, అధికార యోగాలను కలిగిస్తుంది.

Kuja Gochar: కుజుడి బలంతో ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
Kuja Gochar 2025
Follow us on

ధైర్యం, సాహసం, చొరవ, భూ లాభం, స్థిరాస్తులకు కారకుడైన కుజుడు కొన్ని రాశులకు బాగా అనుకూలంగా కాబోతున్నాడు. తనకు బాగా ఇష్టమైన, అనుకూలమైన పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో వారిపై ధన రాశులను కురిపించబోతున్నాడు. ప్రస్తుతం తనకు నీచ స్థానమైన కర్కాటక రాశిలో వక్రించి ఉన్న కుజుడు అతి వేగంతో తిరోగమనం చెందుతున్నాడు. ఈ నెల(జనవరి) 21 తర్వాత అది మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఉగాది వరకూ కుజుడు ఇదే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రకమైన ‘అతిచార’ బలం వల్ల కుజుడు తప్పకుండా మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులవారికి ధన యోగాలను, అధికార యోగాలను కలిగిస్తుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడికి చతుర్థ కేంద్రంలో అతిచార బలం పట్టినందువల్ల ఈ రాశివారికి కూడా ప్రతి ప్రయత్నంలోనూ చొరవ, ధైర్యం, సాహసం, పట్టుదల పెరిగి అనేక విధాలుగా ధనాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి కల తప్ప కుండా నెరువేరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఒకటి రెండు శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అత్యధికంగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి విలువ వృద్ధి చెందుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడికి బలం పెరిగిన కారణంగా అసాధ్యమనుకున్న ప్రయ త్నాలు కూడా సాధ్యంగా మారుతాయి. ఈ రాశికి కుజుడు అత్యంత శుభుడైనందువల్ల ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి బాగా అవకాశం ఉంది. సంతృప్తికరమైన, సానుకూలమైన జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగులకు పదవీ యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. అనారోగ్యాల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
  3. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కుజుడిలో బలం బాగా పెరిగినందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బ డిగా వృద్ధి చెందడం, రావలసిన డబ్బంతా చేతికి అందడం, ఆస్తి వివాదాలు వేగంగా పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
  4. తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న కుజుడిలో బలం, వేగం పెరగడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక అధికార లాభం కలుగుతుంది. నిరుద్యోగు లకు ఊహించని ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఉద్యోగులకు అవ కాశాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ది చెందు తుంది. వృత్తి, వ్యాపారాలు శీఘ్ర పురోగతి చెందుతాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంది.
  5. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి భాగ్య స్థానంలో బలం పెరగడం వల్ల తప్పకుండా ధన యోగాలు, అధికార యోగాలు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందు తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది. పిత్రా ర్జితం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  6. మీనం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు పంచమ స్థానంలో బలంగా, వేగంగా సంచారం చేస్తున్నందు వల్ల పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ చకచకా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు అందలాలు ఎక్కే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి పురోగమిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.