Kuja Gochar: మిథున రాశిలోకి కుజుడి.. ఆ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..!

| Edited By: Janardhan Veluru

Aug 22, 2024 | 4:12 PM

ఆగస్టు 26వ తేదీన కుజుడు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. అక్టోబర్ 20 వరకు కుజుడు మిథున రాశిలో కొనసాగుతాడు. కమ్యూనికేషన్, ప్రయాణాలు, తెలివితేటలు, నైపుణ్యాలు, ప్రతిభకు సంబంధించిన మిథున రాశిలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ గ్రహమైన కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు ఏ రంగంలోని వారైనా చొచ్చుకుపోవడం, అనుకున్నది సాధించడం జరుగుతుంది.

Kuja Gochar: మిథున రాశిలోకి కుజుడి.. ఆ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..!
Mangal Gochar
Follow us on

ఈ నెల 26వ తేదీన కుజుడు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. అక్టోబర్ 20 వరకు కుజుడు మిథున రాశిలో కొనసాగుతాడు. కమ్యూనికేషన్, ప్రయాణాలు, తెలివితేటలు, నైపుణ్యాలు, ప్రతిభకు సంబంధించిన మిథున రాశిలో ‘డేరింగ్ అండ్ డాషింగ్’ గ్రహమైన కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారు ఏ రంగంలోని వారైనా చొచ్చుకుపోవడం, అనుకున్నది సాధించడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, కన్య, తుల, మకర రాశుల వారికి ఈ రెండు నెలల కాలం యోగదాయకం కాబోతోంది. ఈ రాశుల వారు తరచూ స్కంద స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితాలుంటాయి.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల పట్టుదల, ఆత్మ విశ్వాసం, సాహస ప్రవృత్తి, చొరవ పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ తమ కృషిని, తమ నైపుణ్యాలను పెంచడం జరుగుతుంది. రాజీపడని ధోరణి అలవడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయంలో ఊహించని వృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో కుజుడి ప్రవేశం వల్ల భూ సంబంధమైన వివాదాలు, వ్యవహారాల్లో అత్యధిక లాభాలు పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో పట్టుదలగా వ్యవహరించి అందలాలు ఎక్కుతారు. ప్రతి విష యంలోనూ తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. లాభధాయక పరిచయాలను పెంపొందించుకుం టారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారాలను ప్రారంభించే అవకాశం కూడా ఉంది.
  3. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. సహ చరులతో పోటీపడి విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలనిచ్చే ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్ప డతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. ఆస్తి వ్యవహారాలన్నీ చక్కబడతాయి. తల్లితండ్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది.
  5. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ ఆఫర్లు అందడం, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదరడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ సొమ్మును అనుభవించే అవకాశం కలుగుతుంది. తండ్రి నుంచి వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బలం పుంజుకోవడంతో పాటు, విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధా న్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విస్తృతంగా ప్రయాణాలు చేయవలసివస్తుంది.
  6. మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో కుజ సంచారం వల్ల వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో సహచరులతో పోటీపడి విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు, ప్రత్యర్థుల మీద పైచేయిగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా క్రమంగా ఉపశమనం లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులు గట్టెక్కుతారు.